ETV Bharat / state

బస్తీమే సవాల్​: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..

సంక్రాంతి ముగిసింది..కానీ బెట్టింగ్​లు మాత్రం ఆగడం లేదు. తెలంగాణలో పందాల జోరు అమాంతం పెరిగింది. కొద్ది గంటల్లో వచ్చే మున్సిపాలిటీ ఫలితాలపై కాయ్ రాజా కాయ్ అంటూ కోట్లల్లో జూదం మొదలైంది. ఎవరు గెలుస్తారు..ఎంత మెజారిటీ వస్తుంది. రాజకీయ నేతల దగ్గర్నించి సామాన్యుల వరకు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

HEAVY BETTING ON MUNICIPAL ELECTION RESULTS IN TELANGANA

author img

By

Published : Jan 24, 2020, 6:36 PM IST

బస్తీమే సవాల్​: ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ... కోట్లలో బెట్టింగంటా...!

ఈ ఒక్కరోజు ఆగితే.. ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. అప్పటివరకు ఆగలేని కొందరు ఔత్సాహికులు గెలుపు గుర్రాల మీద బెట్టింగులు వేస్తున్నారు. అభ్యర్థుల ప్రచార సరళి, సామర్థ్యాలు, ధనబలం లెక్కలోకి తీసుకొని విజయాన్ని అంచనా వేస్తున్నారు. మున్సిపాలిటీల్లో బాద్​షా ఎవరు..? అన్ని పురపాలికల్లో గులాబీ జెండా ఎగురుతుందా..? కాంగ్రెస్‌, భాజపాలకు చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయా? ఇలా ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది.

పోటాపోటీగా మున్సిపల్ బెట్టింగ్​లు..

శనివారం మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కేటీఆర్ చెబుతున్నట్టు కారు జోరు పనిచేస్తుందా? లేదా కాంగ్రెస్‌ నేతల హస్తవాసి తిరుగుతుందా..? భాజపా ఖాతాలోకి సీట్లు ఎన్నొస్తాయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు కలిసినా ఇదే ముచ్చట. అంతేనా..బెట్టింగ్‌ రాయుళ్లు పోటాపోటీగా పందాలు కాస్తున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఐపీఎల్, సంక్రాంతి పందాల కన్నా జోరుగా మున్సిపల్ బెట్టింగ్ సాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అభ్యర్థుల్లో టెన్షన్​ టెన్షన్

అధికార పార్టీతోపాటు విపక్షాలు ఈసారి పురపాలికల్లో అభ్యర్థులందరూ విచ్చలవిడిగా ఖర్చు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో అభ్యర్థులందరూ గట్టిపోటీనే ఇచ్చారు. దీనికి తోడు.. రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు గెలుపు కోసం బాగానే కష్టపడ్డారు. ఏమాత్రం తగ్గకుండా ప్రలోభాలకు తెరలేపారు. కొందరైతే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ ఓటర్లకు కుమ్మరించారు. ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది. సమయం గడుస్తున్నా కొద్దీ గెలుస్తామా లేదా అనే టెన్షన్​తో పల్స్ రేట్ పెరుగుతోంది.

అధికార పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులు సైతం గెలుపు విషయంలో జంకుతున్నట్టు సమాచారం. స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి మద్ధతిస్తారు. చివరి క్షణంలో ఏ వైపు దూకుతారో గెస్ చేస్తూ జోరుగా పందాలు కాస్తున్నారు.

ఇవీ చూడండి: రాజకీయ నాయకుడినంటూ కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి అరెస్ట్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.