Viveka murder case: ఏపీ మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిలు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. బెయిల్ కోసం కడప కోర్టులో ఈ నెల 19న పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్.. మార్చి 2వ తేదీకి విచారణ వాయిదా వేశారు.
కేసులో నాలుగో(A-4) నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరి గతేడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించిన అంశాలను సీబీఐ తమ వాదనల్లో వినిపించినట్లు సమాచారం. రెండు వైపులా వాదనలు పూర్తి కావడంతో.. విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. అదే రోజు తీర్పు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా.. దస్తగిరి ఈనెల 21న పులివెందుల కోర్టులో మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలాన్ని కూడా సీబీఐ అధికారులు సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేసినట్లు సమాచారం.
ఇదీ చూడండి : వివేకా రక్తపు మరకలను వాళ్లే శుభ్రం చేయించారు: సీబీఐకి ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలం