ప్రపంచ దేశాల్లో కొవిడ్ వల్ల మరణాల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ... భారత్లో మాత్రం తక్కువగా ఉందని.. రాష్ట్రంలో కేవలం 0.5 శాతం మాత్రమే మరణాల రేటు ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిర్మించటం అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రకృతిని శాసిస్తున్నామనకుంటున్న ప్రస్తుత రాకెట్ సైన్స్ కాలంలో కొవిడ్ ప్రభావం పడని మనిషంటూ లేడని మంత్రి పేర్కొన్నారు. వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన మొదట్లో ఆస్పత్రులు తిరిగి డాక్టర్లకు, రోగులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశామని అన్నారు. వంట శాలలోనే రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం ఉండటం భారతదేశం గొప్పతనమన్నారు.
ఎంత టెస్టింగ్, ట్రేసింగ్ చేసినా ప్రజలు అప్రమత్తంగా లేనంత వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టలేమని... ప్రజలు మాస్కులు తప్పకుండా ధరించాలని కోరారు.
-
07.04.2021
— Eatala Rajender (@Eatala_Rajender) April 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Hyderabad
FTCCI ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు.@FTCCI pic.twitter.com/2D4rSUdwih
">07.04.2021
— Eatala Rajender (@Eatala_Rajender) April 7, 2021
Hyderabad
FTCCI ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు.@FTCCI pic.twitter.com/2D4rSUdwih07.04.2021
— Eatala Rajender (@Eatala_Rajender) April 7, 2021
Hyderabad
FTCCI ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు.@FTCCI pic.twitter.com/2D4rSUdwih
ఇదీ చూడండి: రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదు: ఈటల