పేదలకు మెరుగైన వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా మంత్రి ఈటల రాజేందర్... పీహెచ్‌సీలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రభుత్వ పథకాలను ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వైద్య చికిత్సలో వారికి శిక్షణ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్సీలో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్దీకరించే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, జిల్లా సీనియర్ డేటా ప్రోగ్రామింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నిమ్స్‌ను అత్యున్నత ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం: ఈటల