రెండో దశ కొవిడ్ పట్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో కొవిడ్ వ్యాక్సిన్ చైతన్య వేదిక... కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్ చేయించుకుందాం... కొవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం అనే పత్రికను ఆయన ఆవిష్కరించారు.
కొవిడ్ రెండో దశ విస్తరణ వేగంగా ఉన్నా... మనదేశంలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని మంత్రి వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆయన కోరారు. వైరస్ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దన్నారు. ఆసుపత్రుల్లో పడకలు, మందులు, వ్యాక్సిన్‌కు కొరత లేదన్నారు.
ఎవరిని నిందించకుండా... ఎవరో వస్తారని ఎదురు చూడకుండా స్వీయ రక్షణ పాటిస్తూ... కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఈటల సూచించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, హైజినిక్‌గా ఉండడం వంటివి తప్పనిసరిగా చేయాలని ఇన్ఫిక్షన్ డిసిసెస్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ వి.ఎలడావి తెలిపారు.
ఇదీ చూడండి: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి... లేదంటే రూ. వెయ్యి ఫైన్