ETV Bharat / state

ఇంట్లోనే ఐసోలేషన్... అవసరమైతే రోగుల వద్దకే వైద్యులు: మంత్రి ఈటల

author img

By

Published : Jul 1, 2020, 4:43 AM IST

Updated : Jul 1, 2020, 6:44 AM IST

జిల్లాల్లోని అన్ని మెడికల్ కళాశాలల్లో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. వెంగళరావునగర్‌లోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

health minister eetala rajendar review
స్వల్ప లక్షణాలుంటే ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో చికిత్స అందించాలి: ఈటల

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని ఉన్నతస్థాయి ఆసుపత్రుల వరకూ అన్ని స్థాయిల్లోనూ వైద్యసేవల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమవడం వల్ల సీజనల్‌ వ్యాధులు కూడా ప్రబలే అవకాశాలెక్కువగా ఉంటాయనీ, కరోనా చికిత్సలతో పాటు సీజనల్‌, ఇతర వ్యాధులకు సంబంధించిన మందుల కొరత రానీయొద్దని కోరారు.

అన్ని ఆసుపత్రుల్లోనూ అవసరాలకు అనుగుణంగా మందులను, పరికరాలనూ కొనుగోలు చేయాలని, ఆ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేశారు. టిమ్స్‌లో సేవలకు ఎంపికైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది బుధవారం విధుల్లో చేరుతారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.

అవసరమున్నవారి ఇంటికి వైద్యులు
పాజిటివ్‌ వచ్చినవారిలో స్వల్ప లక్షణాలుంటే ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో చికిత్స అందించాలని, వీరికి ఉదయం, సాయంత్రం ఫోన్‌ చేసి వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవాలని మంత్రి సూచించారు. వైద్యసేవలు అవసరమున్నవారి ఇంటికి వైద్యులను పంపించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన రోగులకు తప్పనిసరిగా రోజుకు కనీసం మూడుసార్లు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని, రోగులకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.

అన్ని జిల్లాల్లోనూ వైద్యకళాశాలల్లో రోగులను చేర్చుకోవడానికి వీలుగా పడకలను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఇంటింటికి తిరిగి అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు నిండిపోవడంపైనా సమావేశంలో చర్చించారు.

విస్తృతంగా పరీక్షలు

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను అవసరమున్న ప్రతి ఒక్కరికి చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం 11 కేంద్రాలను ఎంపిక చేశామని, అనుమానిత లక్షణాలున్న వారందరూ ఆయా కేంద్రాల్లో నమూనాలను ఇవ్వవచ్చని సూచించారు.

1. కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి
2. ఫీవర్‌ ఆసుపత్రి-నల్లకుంట
3. ఛాతీ ఆసుపత్రి-ఎర్రగడ్డ
4. ప్రకృతి వైద్యశాల-అమీర్‌పేట
5. సరోజినీదేవి కంటి ఆసుపత్రి-మెహిదీపట్నం
6. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి-ఎర్రగడ్డ
7. ప్రభుత్వ హోమియో ఆసుపత్రి-రామంతపూర్‌
8. నిజామియా టీబీ ఆసుపత్రి-చార్మినార్‌
9. కొండాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రి
10. వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి
11. ఈఎస్‌ఐ ఆసుపత్రి-నాచారం

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

Last Updated : Jul 1, 2020, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.