ETV Bharat / state

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి టీకాలెలా..? ఆరోగ్యశాఖ తర్జన భర్జన..! - vaccination in telangana

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి మే1 నుంచి టీకాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 18 నుంచి 44 ఏళ్ల వయసు మధ్య కోటీ 80 లక్షల మంది ఉండగా.. రెండు డోసుల టీకాలు కలుపుకుని 3 కోట్ల 60 లక్షల టీకాలు అవసరం. ఈ నేపథ్యంలో భారీ సరఫరా సాధ్యాసాధ్యాలపై ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది.

18 ఏళ్లు దాటిన వారికి టీకాలెలా
18 ఏళ్లు దాటిన వారికి టీకాలెలా
author img

By

Published : Apr 28, 2021, 3:28 AM IST

రాష్ట్రంలో 18-44 ఏళ్ల మధ్య వయస్కులకు ఉచిత టీకాల అందజేతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ భారీ కార్యక్రమం వచ్చే నెల 1న ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. బుధవారం నుంచి కొవిన్‌ యాప్‌లో ఈ కేటగిరీలో సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే ప్రకటించడంతో.. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా.. అని అర్హులు ఎదురుచూస్తున్నారు. అయితే.. కొవిన్‌ యాప్‌లో నమోదుతో సంబంధం లేకుండానే 18-44 ఏళ్ల అర్హులందరికీ టీకాలను ఉచితంగా అందజేస్తామనీ, ఈ కేటగిరీల్లో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో టీకాలను కొనుగోలు చేస్తోందనీ, కాబట్టి టీకాలపై కేంద్రానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. టీకాల అందజేతపై ప్రణాళిక పక్కాగా ఉన్నా.. సమస్యల్లా అసలు అంత భారీగా టీకాలు సరఫరా అవుతాయా అన్నదే! ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి, వైద్య, రెవెన్యూ, పోలీసు, పురపాలక, పంచాయతీరాజ్‌ సిబ్బందికి టీకాల అందజేతకు అవసరమైన డోసులను కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.
ప్రణాళిక ఎలా?
* రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో టీకాలు పొందేవారు సుమారు 80 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే 37.58 లక్షల మందికి తొలిడోసును, 5.30 లక్షల మందికి రెండోడోసును పంపిణీ చేశారు. మిగిలిన వారికి కూడా టీకాలను కేంద్రమే దశల వారీగా సరఫరా చేస్తోంది. కాబట్టి వీటి విషయంలో ఆందోళన అక్కర్లేదు.
* ప్రస్తుతం ఈ కేటగిరీల లబ్ధిదారులకు టీకాలను అందించడానికి ప్రభుత్వ వైద్యంలో సుమారు 1200 కేంద్రాలను, ప్రైవేటులో సుమారు 250 కేంద్రాలను నెలకొల్పారు.
* వీరుకాక 18-44 ఏళ్ల మధ్యవయస్కులు రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరికి రెండు డోసులు వేయాలంటే మొత్తంగా 3.60 కోట్ల డోసుల టీకాలు కావాలి.
* వీరి కోసం కూడా అదనంగా ప్రభుత్వ వైద్యంలోనే మరో 1500 కేంద్రాలను కొత్తగా నెలకొల్పాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ప్రభుత్వ వైద్యంలోనే ఒక్కరోజులో 2700 పంపిణీ కేంద్రాలు పనిచేయాల్సి ఉంటుంది.
* ఈ 1500 కేంద్రాల్లోనూ రోజుకు తక్కువలో తక్కువగా కనీసం 2లక్షల మందికి టీకాలిచ్చినా.. నెలకు 60 లక్షల మందికి ఇవ్వగలుగుతారు. అంటే మొదటి నెలలో (ఒకవేళ మేలో మొదలుపెడితే ఇదే నెలలో) తొలిడోసు మాత్రమే ఇస్తారు కాబట్టి.. 60 లక్షల డోసులు కావాలి.
* అలా 1.80 కోట్ల మందికి తొలిడోసు వేయడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అంటే మే, జూన్‌, జులై నెలాఖరు వరకూ తొలిడోసు టీకాలు అందజేస్తారు.
* రెండో నెల నుంచి తొలిడోసు లబ్ధిదారులతో పాటు రెండోడోసు వారికీ టీకాలు అందించాల్సి ఉంటుంది. అప్పుడు తొలి, మలి డోసు కలుపుకొని నెలకు 1.20 కోట్ల డోసులు అవసరమవుతాయి. జూన్‌, జులైల్లో ఇదే విధానం కొనసాగుతుంది. అంతా సక్రమంగా జరిగితే ఆగస్టులో రెండోడోసు లబ్ధిదారులు మాత్రం మిగిలి ఉంటారు.
* జూన్‌, జులై నెలల్లో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి.. తదనుగుణంగా టీకాల పంపిణీ కేంద్రాల సంఖ్యను సైతం సుమారు 3000 వరకూ పెంచాల్సి ఉంటుంది.
* ఇంత పక్కాగా ప్రణాళికబద్ధంగా టీకాల పంపిణీని నిర్వహిస్తే.. ఆగస్టు చివరి నాటికి 18 ఏళ్లు దాటిన వారందరికీ కూడా కొవిడ్‌ రెండు డోసుల పంపిణీ పూర్తవుతుంది.

ఎందుకు సమస్య?

దేశంలో ప్రస్తుతం రెండు సంస్థలు కొవిడ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటి సామర్థ్యం నెలకు గరిష్ఠంగా సుమారు 6 కోట్లు. ఇది ప్రస్తుత అంచనా. ఇందులో సగం డోసులను కేంద్రం తీసుకొని 45 ఏళ్ల దాటిన వారికి టీకాల పంపిణీలో భాగంగా సరఫరా చేస్తుంది. మిగిలిన 3 కోట్లను అన్ని రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. జనాభా ప్రాతిపదికన టీకాల సరఫరాను విభజిస్తే.. రాష్ట్రానికి నెలకు 6-7 లక్షలకు మించి వచ్చే అవకాశాలు లేవని వైద్యవర్గాలు తెలిపాయి. నెలకు కనీసం 60 లక్షలు అవసరమైన పరిస్థితుల్లో కేవలం ఆరేడు లక్షలు ఏ మూలకూ సరిపోవనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ ప్రస్తుత సామర్థ్యాని కంటే ఉత్పత్తిని రెట్టింపు చేసినా.. అప్పుడు సైతం జనాభా ప్రాతిపదికన గరిష్ఠంగా 15 లక్షలకు మించి రాష్ట్రానికి దక్కే అవకాశాల్లేవు. ఈ సమస్య నుంచి గట్టెక్కడమెలా? అనే విషయంపై ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది.

తెలంగాణలోనే ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి అధిక కేటాయింపులు ఇవ్వాలని భారత్‌ బయోటెక్‌ సంస్థను కోరినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. అయితే అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేయాల్సి ఉండడంతో.. రాష్ట్రం వినతి మేరకు రెండు సంస్థలు కలిపి నెలకు 60 లక్షల డోసులను సరఫరా చేస్తాయా? వాటికంత సామర్థ్యముందా? అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రాలకే కాక బహిరంగ విపణిలో, ప్రైవేటు ఆసుపత్రులకు కూడా సరఫరా చేయాల్సి ఉండడంతో.. ఉత్పత్తి సంస్థలు రాష్ట్ర అంచనాలకు తగ్గట్లుగా సరఫరా చేయడంపై అస్పష్టత నెలకొంది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయంపై మరోసారి ఉత్పత్తి సంస్థలతో ప్రత్యేకంగా సమావేశమవుతారనీ, ఆ తర్వాతే ఎప్పట్నించి 18-44 ఏళ్ల మధ్యవయస్కులకు టీకాల పంపిణీ ప్రారంభిస్తారనే విషయంపై స్పష్టత వస్తుందని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ అంచనాలకు తగ్గట్లుగా సరఫరా లేకపోతే.. 18-44 ఏళ్ల మధ్యవయస్కుల టీకాల ప్రక్రియ నిరంతరాయంగా నెలల తరబడి కొనసాగే అవకాశాలున్నాయని అయన తెలిపారు. అదే జరిగితే మూడో, నాలుగో దశ ఉధ్ధృతి కొనసాగే సమయానికీ రాష్ట్రంలో తొలిడోసు కూడా పూర్తవని పరిస్థితి నెలకొంటుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.