హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్స్ కరోనాతో మృతిచెందారు. పదవీ విరమణకు 4 రోజుల ముందు హెడ్‌నర్స్ కరోనాకు బలైంది. కరోనా సోకక ముందు విధులు నిర్వహించి ఎంతో మందికి సేవలందించారు. 4 రోజుల్లో పదవీ విరమణ పొందే క్రమంలో వైరస్ కాటుకు బలికావడం ఆమె తోటి నర్సులను, వైద్యులను విస్మయానికి గురి చేసింది.
కరోనా లక్షణాలు బయటపడిన వెంటనే హెడ్‌నర్స్ గాంధీలో చేరారు. చికిత్సపొందుతూ శుక్రవారం మరణించినట్లు చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ నిర్ధరించారు. హెడ్‌నర్స్ భర్తకు మహమ్మారి సోకడం వల్ల ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. కరోనా బారిన పడిన వారి కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సులకు మహమ్మారి సోకి వారి ప్రాణాలనే హరిస్తోంది.
ఇవీ చూడండి: 'దాసరి' కుటుంబంలో ఆస్తి తగాదాలు