ETV Bharat / state

హెడ్ కానిస్టేబుల్ బండిపై వెళ్లి దొంగతనానికి యత్నం

నలుగురు యువకులు బైక్​పై దొంగతనానికి వెళ్లారు... వాడి అలికిడి విని స్థానికులు వారిలో ముగ్గురిని, బండిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించగా..నిందితులు వాడిన బండిని చూసి వారంతా అవాక్కయ్యారు.

హెడ్ కానిస్టేబుల్ బండిపై వెళ్లి దొంగతనానికి యత్నం
author img

By

Published : Jul 5, 2019, 1:26 PM IST

హైదరాబాద్​ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వినూత్న ఘటన జరిగింది. రాత్రి నలుగురు యువకులు ఓ ద్విచక్ర వాహనంపై దొంగతనానికి వెళ్లారు. గమనించిన స్థానికులు వారిలో ముగ్గురిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారు వచ్చిన బండిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అది ఆ స్టేషన్​లోనే క్రైమ్ బ్రాంచ్ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్​ నాగేశ్వరరావుది.

హెడ్ కానిస్టేబుల్ బండిపై వెళ్లి దొంగతనానికి యత్నం

ఈ విషయంపై ఉన్నతాధికారులు నాగేశ్వర్​రావును ప్రశ్నించగా.. పంక్చర్ చేయించమని నిందితుల్లో ఒకరైన మున్నాకు ఇచ్చినట్లు తెలిపాడు. దీనిపై దృష్టి సారించిన అధికారులు.. మున్నా గ్యాంగ్ ఎంత కాలం నుంచి దొంగతనాలకు పాల్పడుతోంది? వారితో హెడ్ కానిస్టేబుల్ ఉన్న సంబంధం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి వచ్చి పారిపోయిన మరో యువకుని కోసం కూడా గాలిస్తున్నారు.

ఇదీ చూడండి : పిస్టల్​తో కాల్చుకున్న ఫైజన్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.