ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్‌కు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్తో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కలిసి పని చేయనుంది. సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ వ్యవసాయంలో సాంకేతిక నిర్వహణ గురించి దూరవిద్య విధానంలో ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును అందించనుంది.
టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్‌గా పిలుస్తోన్న ఈ కోర్సుకు మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం ప్రకటించింది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, న్యాయ సంబంధ సంస్థలు తదితరాలతో చర్చించి కోర్సు పాఠ్యాంశాలు తయారు చేశామని పేర్కొంది. మేధో సంపత్తి హక్కులు, నవకల్పనలు, గ్రామీణ నవకల్పనల లాంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లో కొత్తగా 4 కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు