ETV Bharat / state

హెచ్​సీఏలో ప్రతిభ కలిగిన పేద ఆటగాళ్లకు అన్యాయం: వినోద్​ - విజయ్​ హజారే ట్రోఫీ ఎంపికలో హెచ్​సీఏ అధికారుల నిర్లక్ష్యం

ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయకుండా అన్యాయం చేస్తున్నారని హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్​సీఏ) మాజీ అధ్యక్షుడు వినోద్​ ఆరోపించారు. విజయ హజారే ట్రోఫీకి ఎంపిక చేయలేదంటూ హెచ్​సీఏ సభ్యులు, తల్లిదండ్రులతో కలిసి ఆటగాళ్లు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్​ జింఖానా మైదానంలోని హెచ్​సీఏ కార్యాలయం ముందు ప్లకార్డులు ప్రదర్శించారు.

Parents dharna at HCA office
హెచ్​సీఏ కార్యాలయం ముందు ఆందోళన
author img

By

Published : Feb 13, 2021, 4:21 PM IST

Updated : Feb 13, 2021, 4:58 PM IST

విజయ్​ హజారే ట్రోఫీకి ఆటగాళ్ల ఎంపిక విషయంలో అవతవకలు జరిగాయంటూ మాజీ హెచ్​సీఏ అధ్యక్షుడు వినోద్ ఆరోపించారు. టోర్నీకి ఎంపిక కానీ ఆటగాళ్లు వారి తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలోని హెచ్​సీఏ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిభను కాదని డబ్బున్న వారికే ఎంపికలో ప్రాధాన్యం ఇస్తున్నారని హెచ్​సీఏ సభ్యులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు.

హెచ్​సీఏ తీరు సరికాదు:

విజయ్ హజారే ట్రోఫీలో 26 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా.. 15 మంది విషయంలో అవకతవకలు జరిగాయని అన్నారు. గత కొన్ని రోజులుగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న ఆటగాళ్లను విస్మరించి కేవలం హెచ్​సీఏకు చెందిన వారి పిల్లలను, డబ్బున్న వారికే పెద్దపీట వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా అన్ని టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్ల విషయంలో హెచ్​సీఏ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు.

పునరాలోచించాలి:

ప్రస్తుత క్రికెట్ పోటీ ప్రపంచంలో ఎంతో మంది ప్రతిభ కలిగిన పేద ఆటగాళ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవడానికి హెచ్​సీఏ విధానాలే కారణమని ఆరోపించారు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో మరోసారి పునరాలోచించాలని వినోద్​ అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి సెలక్షన్స్ ఎప్పుడూ జరగలేదని ఆయన తెలిపారు. ఇప్పటికే రంజీ ట్రోఫీలో హైదరాబాదు జట్టు వెనుకబడిందని.. ఇలాగే కొనసాగితే హైదరాబాద్ నుంచి జాతీయ జట్టుకు ఎంపిక కాలేరని ఆయన అన్నారు.

ఇదీ చూడండి : 'ఆంధ్రాలో ఏం చేయలేకనే.. తెలంగాణలో పార్టీ'

Last Updated : Feb 13, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.