ETV Bharat / state

HIGH COURT: 'ప్రైవేట్ అధ్యాపకులకు వేతనాల చెల్లింపుపై వివరణ ఇవ్వాలి' - telangana news

ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధ్యాపకులకు వేతనాలు చెల్లించడం లేదన్న అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కొవిడ్ పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో అధ్యాపకులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది శ్రవణ్ లేఖను పిల్​గా స్వీకరించిన ధర్మాసనం.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసీటీఈకి నోటీసులు ఇచ్చింది.

'ప్రైవేట్ అధ్యాపకులకు వేతనాలు చెల్లించడం లేదన్న అంశంపై వివరణ ఇవ్వాలి'

author img

By

Published : Jul 29, 2021, 10:02 PM IST

ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధ్యాపకులకు సుమారు 11 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్న అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఏఐసీటీఈకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కళాశాలల్లో అధ్యాపకుల కొరతపై కూడా వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. కొవిడ్ పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో అధ్యాపకులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. అదేవిధంగా విద్యా సంస్థల్లో సరైన వసతులు లేవంటూ న్యాయవాది శ్రవణ్ లేఖను పిల్​గా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్​రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాష్ట్రంలో విద్యా సంస్థల్లో పొరుగు సేవల సిబ్బంది ఎక్కువగా ఉన్నారని.. దేశమంతా ఇలాగే ఉందా లేక తెలంగాణలోనేనా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో సిబ్బంది కొరత, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు తగినంత లేకపోవడం వంటి లేఖలోని అంశాలన్నింటిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని, ఏఐసీటీఈని ఆదేశిస్తూ విచారణ సెప్టెంబరు 28కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: CAR FELL IN WELL: బావిలో కారు పడిన ఘటనలో ఒక మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.