Hayatnagar young man murder case : ఒక్క మిస్‌డ్ కాల్ ఇద్దరు వ్యక్తులను పరిచయం చేసింది. అదే ఫోన్‌కాల్ వారి ఇరువురి మధ్య ఏర్పాడిన స్నేహ బంధం వివాహేతర బంధంగా బలపరిచింది. హాయిగా వెళ్లిపోతున్న వారి జీవితాల్లో అదే ఫోన్‌కాల్ వారి ప్రాణాలను బలితీసుకుంటుందని పాపం వారు ఊహించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హయత్‌నగర్‌లోని యువకుడు రాజేశ్ మృతి కేసును పోలీసులు చేధించి.. విస్మయం కలిగించే వాస్తవాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఏడాదిన్నర క్రితం రాజేశ్ ఇచ్చినా మిస్డ్ కాల్‌తో హయత్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సుజాత, ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న రాజేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రాజేశ్‌కు తన వ్యక్తి గత ఫొటోలను టీచర్ సుజాత పంపించారు. దీంతో ఆమెపై అమితంగా రాజేశ్ ప్రేమ పెంచుకున్నాడు. ఇది కాస్త వారి ఇరువురి మధ్య వివాహేత సంబంధానికి దారి తీసింది.
- ఫేస్బుక్ పరిచయం.. వివాహేతర సంబంధం.. కట్ చేస్తే..
- ప్రేమ పెళ్లి.. వివాహేతర సంబంధం.. చివరికి అడ్డువచ్చిన వారిని..!
Amberpet Rajesh Murder Case : ఈ క్రమంలో వారు ఇరువురు రోజు కలుసుకోవడం.. మాట్లాడుకోవడం చేసేవారు. కొద్ది రోజుల క్రితం సుజాత.. రాజేశ్‌ను దూరం చేయడంతో యువకుడు మానసిక ఒత్తిడికి లోనైయ్యాడు. ఆమె కోసం ఇంటి చుట్టూ తిరిగేవాడు. తనతో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చేవాడు. రాజేశ్ ప్రవర్తన నచ్చక ఆందోళనకు గురైన సుజాత చివరి సారిగా ఈనెల 24వ తేదీన ఇద్దరు కలిశారు. ఆ తరువాత ఇరువురు మాట్లాడుకొని పురుగుల మందు తాగి చనిపోవాలని బలంగా నిర్ణయించుకున్నారు.
హయత్‌నగర్‌లోని ఓ దుకాణంలో సుజాత పేరు మీద పురుగుల మందును రాజేశ్ కొనుగోలు చేశాడు. దానిని తీసుకొని సుజాత ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగింది. దీనిని గమనించిన ఆమె భర్త సుజాతను ఆసుపత్రిలో చేర్పించారు. వార్తను తెలుసుకున్న రాజేశ్ సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సుజాత చికిత్స పొందుతూ ఈ నెల 29వ తేదీన మృతి చెందింది. రాజేశ్, సుజాత ఫోన్లను పరిశీలించిన పోలీసులు వివాహేతర సంబంధం, ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమతో ఇద్దరూ అనుకునే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు: ఈనెల 29వ తేదీన అనుమాన స్థితిలో హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట పరిసరాల్లో కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చనిపోయిన వ్యక్తి రాజేశ్‌గా గుర్తించారు. ఆ తరువాత అతను ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ ద్వారా సుజాతతో పరిచయం ఉన్నట్లు గుర్తించారు. సుజాత భర్త.. రాజేశ్‌ను ఏమైనా చేసి ఉంటారా అని అనుమానించారు. లేదా ఇతరులు ఎవరైనా హత్య చేశారా..? రాజేశ్ ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు.
ఇవీ చదవండి: