ETV Bharat / state

Hattrick Leaders in Telangana : ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. హ్యాట్రిక్‌ కొట్టాలని.. చరిత్రలో నిలవాలని..

Hattrick Leaders in Telangana : రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. టికెట్లు పొందిన అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నారు. మరోవైపు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కొందరు అభ్యర్థులు.. హ్యాటిక్‌పై గురిపెట్టారు.

Telangana Assembly Elections 2023
Hattrick Leaders in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 6:02 AM IST

Hattrick Leaders in Telangana : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు కదనరంగంలోకి దూకారు. ప్రత్యర్థుల వ్యూహాలకు.. చెక్‌పెడుతూ ప్రచారంలో (Campaign) దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, ఇంటిటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ అధినేతల వరకు ఆచితూచి అడుగులేస్తున్నారు. బరిలో నిలిపిన గుర్రాలను గెలుపు బాట పట్టించడానికి పార్టీలు పరుగులెత్తుతుండటంతో ప్రచారం ఉరకలెత్తుతోంది.

Telangana Assembly Election Polling Arrangements : ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల చర్యలు

Some Leaders Trying to Hattrick in Elections : ఓవైపు కొందరు నాయకులు ఇప్పటికే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించగా (Hattrick Leaders).. మరోవైపు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన మరికొందరు నేతలు.. ఈ ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలనే ధీమాతో ఉన్నారు. కానీ ఓటర్లను మెప్పించి వరసగా మూడుసార్లు గెలవడం అభ్యర్థులకు పెద్ద సవాలే అని చెప్పవచ్చు. హైదరాబాద్‌లో కొందరే ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ నుంచి టి.ప్రకాశ్‌ గౌడ్‌, ఆసిఫ్‌నగర్‌ నుంచి దానం నాగేందర్‌ ఇదివరకే హ్యాట్రిక్‌ కొట్టారు. వీరు ఈసారీ ఎన్నికల్లో బరిలో ఉండగా.. మరికొంత మంది హ్యాట్రిక్‌ రేసులో ఉన్నారు.

  • సనత్‌నగర్‌నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ 2014లో తెలుగుదేశం పార్టీ, 2018లో బీఆర్ఎస్‌ నుంచి గెలుపొందారు. ఇప్పడు గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తాననే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.
  • కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్‌ తరఫున ఎమ్మెల్యే కేపీ వివేకానంద పోటీచేస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి గెలుపొందారు. అనంతరం 2018లో బీఆర్ఎస్‌లో నుంచి విజయం సాధించారు.
  • కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు 2014లో తెలుగుదేశం పార్టీ, 2018లో బీఆర్ఎస్‌ నుంచి విజయం సాధించారు. తాజాగా అదేపార్టీ తరఫున బరిలో నిలిచారు.
  • శేరిలింగంపల్లి నుంచి బీఆర్ఎస్‌ తరఫున ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హ్యాట్రిక్‌ విజయం కోసం బరిలో దిగారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి, 2018లో బీఆర్ఎస్‌ నుంచి విజయం సాధించారు
  • జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా గోపీనాథ్‌ 2014లో తెలుగుదేశం పార్టీ, 2018లో బీఆర్ఎస్‌ తరఫున విజయం సాధించి.. మరోసారి బరిలో నిలిచారు.
  • చేవెళ్ల నుంచి యాదయ్య 2014లో కాంగ్రెస్‌ నుంచి, 2018లో బీఆర్ఎస్‌ తరఫున గెలుపొందారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్లీ పోటీలో ఉన్నారు.

ఒకే పార్టీ నుంచి..

  1. సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‌ తరఫున టి.పద్మారావు బరిలో ఉన్నారు. 2004లో సికింద్రాబాద్‌ నుంచి విజయం సాధించారు. 2009లో సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఓడిపోయినా.. తిరిగి సికింద్రాబాద్‌ నుంచి 2014, 2018లో గెలుపొందారు. ఈసారి హ్యాట్రిక్‌పై ఆయన గురిపెట్టారు.
  2. పటాన్‌చెరు నియోజకవర్గంలో.. బీఆర్ఎస్‌ నుంచి మహిపాల్‌రెడ్డి 2014, 2018లో విజయం సాధించారు. మూడోమారు గెలుపు కోసం ఆయన శ్రమిస్తున్నారు.
  3. షాద్‌నగర్‌ నియోజకవర్గం నుంచి అంజయ్య యాదవ్‌ హ్యాట్రిక్‌ కోసం బరిలో ఉన్నారు.
  4. గోషామహల్‌ నియోజరవర్గం నుంచి బీజేపీ తరఫున రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ ఖాయమంటున్నారు.

తెలంగాణ పోలింగ్ @30 డేస్.. 'అభివృద్ధి' మంత్రంతో బీఆర్ఎస్ .. 'బీసీతంత్రం'తో బీజేపీ .. 'ఆరింటి'పైనే ఆశలతో కాంగ్రెస్

Congress MLA Ticket Issues in Telangana : కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాల.. అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి ముఖ్యనేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.