ETV Bharat / state

Harvard University Invitation to KTR : కేటీఆర్‌కు హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం.. ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని పిలుపు - KTR will speak at Harvard University

Harvard University Invitation to KTR : కేటీఆర్‌కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. 2024 ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని కోరింది. హార్వర్డ్ ఆహ్వానంపై సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధి విధానాలను వివరించేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు.

Minister KTR
Minister KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 9:13 PM IST

Harvard University Invitation to KTR : వచ్చే ఫిబ్రవరిలో బోస్టన్ వేదికగా జరగనున్న ఇండియా సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్​ను (KTR) హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. ఇండియా రైజింగ్ - బిజినెస్, ఎకానమీ, కల్చర్ థీమ్​తో ఇండియా సదస్సు 21వ ఎడిషన్​ను హార్వర్డ్ నిర్వహించనుంది. 2024 ఫిబ్రవరి 18న ఈ సదస్సు జరగనుంది. అమెరికాలో విద్యార్థులు నిర్వహించే పెద్ద సదస్సు అయిన ఇండియా కాన్ఫరెన్స్​లో.. మన దేశానికి సంబంధించిన వెయ్యి మందికి పైగా విధాన నిపుణులు, బిజినెస్ లీడర్స్, విద్యావేత్తలు, విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు.

KTR Invited To Harvard 21st Edition at America : గతంలో అమర్త్యసేన్, అజీం ప్రేమ్ జీ, అనామికా ఖన్నా లాంటి వారితో పాటు.. పలువురు మంత్రులు, బిజినెస్ లీడర్స్, విద్యావేత్తలు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ నాయకత్వం కీలకపాత్ర పోషించిందని.. పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా తీర్చిదిద్దారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) ఆహ్వానంలో పేర్కొంది. ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధి విధానాలను వివరించేందుకు సదస్సు మంచి వేదిక అని అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను కూడా వివరించవచ్చని ఆయన తెలిపారు.

KTR Laid Foundation Eurofins Campus : 'ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించటమే నేతల ముందున్న సవాల్‌'

ఇటీవలే మంత్రి కేటీఆర్​కు మరో అంతర్జాతీయ అహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితమహుడు నార్మన్​ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న బోర్లాగ్​ ఇంటర్నేషనల్​ సమావేశంలో.. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిందిగా సంస్థ ప్రతినిధులు.. కేటీఆర్​ను ఆహ్వానించారు. రాష్ట్ర అనుభవాలను చర్చించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బోర్లాగ్​ ఇంటర్నేషనల్​ సమావేశాలకు హాజరవుతున్న అనేక మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రంలో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు టెర్రీ బ్రాన్‌స్టాడ్‌ పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను సమావేశంలో ప్రసంగించాలని కోరారు.

Borlaug International Dialogue 2023 : అక్టోబరు 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని అయొవా రాష్ట్రంలోని.. డెమోయిన్‌ నగరంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సంవత్సరం జరగనున్న సమావేశంలో ట్రాన్స్‌ఫర్మేటివ్‌ సొల్యూషన్స్‌ టు అచీవ్‌ ఎ సస్టెయినబుల్, ఈక్విటబుల్‌ అండ్‌ నర్షింగ్‌ ఫుడ్‌ సిస్టమ్‌’అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి. ఈ సమావేశానికి ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు నేరుగా హాజరు కానున్నారు. వేల మంది ఆన్‌లైన్‌లో భాగస్వామ్యం అవుతారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యవసాయ రంగానికి, ఆహారభద్రతకు ఎదురయ్యే సవాళ్లపై ఏటా ఈ సమావేశాల్లో చర్చలు జరుపుతారు.

KTR at Chicago Food Stop : 'తెలంగాణ ఫుడ్​స్టాప్' తెస్తాం.. షికాగోలో 'ఆహారంలో సృజనాత్మకత'పై ప్రసంగంలో కేటీఆర్

ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణ సాధించిన వ్యవసాయ ప్రగతి, రాష్ట్రం అనుసరించిన విధానాలు ఈ సమావేశంలో చర్చించడం ద్వారా.. ప్రపంచ ఆహార కొరతను అధిగమించడం, ఆహార భద్రత, సరఫరాను పెంచడం, వంటి కీలకమైన అంశాలపై ఒక విస్తృత అవగాహన ఏర్పడుతుందని టెర్రీ బ్రాన్‌స్టాడ్‌ తెలిపారు. రాబోయే భవిష్యత్​ తరాలకు వ్యవసాయరంగంలో వనరుల సద్వినియోగంపై ఈ సమావేశంలో చర్చా జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

KTR Invited to Asia Berlin Summit : ఆసియా-బెర్లిన్‌ సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

Invitation To KTR: మరో అంతర్జాతీయ సదస్సు నుంచి మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.