హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కళాశాలలో హరితహారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి మునీంద్ర హాజరయ్యారు. ఇందులో కళాశాల ప్రిన్సిపల్ రోజారాణితో పాటు 500 మంది విద్యార్థులు పాల్గొని... కళాశాల ఆవరణలో భారీగా మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరి బాధ్యత...
పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రిన్సిపల్ రోజారాణి అన్నారు. మొక్కలు నాటడం వల్ల వాతావరణ కాలుష్యం నియంత్రతతో పాటు జీవావరణం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కళాశాలలో మొక్కలను సంరక్షించే విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి : కేసీఆర్ సొంత గ్రామానికి రూ.10కోట్ల ప్రత్యేక నిధులు