Rythu Bhima Scheme Completes Five Years : అర్హులైన రైతులందరి తరఫున ప్రభుత్వమే ఎల్ఐసికి(LIC) ప్రీమియం చెల్లిస్తూ.. ఇంటి పెద్దను కోల్పోయిన సంబంధిత రైతు కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు.
నేడు 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగిందని తెలిపారు. తొలి సంవత్సరం 2018లో ఎల్ఐసీకి రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే.. నేడు రూ. 1477 కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నాట్లుగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతుల తరఫున ప్రభుత్వం రూ. 6861 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించగా.. వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందిందన్నారు.
Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో జమ
గుంట భూమి ఉన్నా చాలు, రైతుగా గుర్తించి.. ఆ రైతన్న మరణిస్తే సంబంధిత కుటుంబానికి రూ. 5 లక్షలు అందించే అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. రైతుల గురించే కాదు, ఆ రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మంచి మనసున్న ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు.
Rythu Bhima Scheme Age Limit : చిన్న, సన్నకారు రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే.. ఆ కుటుంబం జీవనోపాధికీ ఇబ్బందే. ఈ దుస్థితిని తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న రైతుబీమా పథకం.. బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. ఈ పథకంలో నమోదైన రైతు ఏ కారణంతో కన్నుమూసినా అతని కుటుంబానికి పరిహారం అందుతుంది.
18 నుంచి 59 ఏళ్ల లోపు రైతులు ఈ పథకానికి అర్హులు కాగా.. ఇందులో నమోదైన రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవితబీమా పరిహారం ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా అందుతోంది. వ్యవసాయ విస్తరణ అధికారులు.. మరణించిన రైతు వివరాలు ఎల్ఐసీకి అందిస్తారు. ఈ వివరాలన్నీ అందిన 3 రోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం విడుదలవుతోంది.
Rythu Runamafi 2023 : అన్నదాతలకు బ్యాంక్ అప్పుల నుంచి విముక్తి కల్పించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు రుణమాఫీ (Farmer Loan Waiver) ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు రూ.99,999 వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాలు మేరకు.. పంద్రాగస్టు ఒక్కరోజే 10.79 లక్షల రైతులకు.. రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది.