Sangareddy Congress leaders Joined in BRS Party : మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఇవాళ జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ సంఘ నేతలు, బీఆర్ఎస్లోకి రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు అందించామని పేర్కొన్నారు. పాత, కొత్త వారు కలిసి పని చేసి గులాబీ జెండా ఎగరేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా.. బీఆర్ఎస్ పాలనలో కరెంటు బాగుందా అని తెలంగాణ సమాజం ఆలోచించాలని పేర్కొన్నారు.
"కాంగ్రెస్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. కరెంటుపై ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్కు అంత లాభం. జహీరాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం బంద్ అయింది. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. జహీరాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తాం. పాత, కొత్త నేతలు కలిసి పని చేసి గులాబీ జెండా ఎగురవేయాలి". - హరీశ్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
- Revanth Reddy Letter To Farmers : 'రైతువేదికలపై రాజకీయాలు చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ సర్కార్‌ను నిలదీయాలి'
- HarishRao Latest News : 'తెలంగాణతో కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం.. కానీ కాంగ్రెస్, బీజేపీది పేకమేడల బంధం'
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అద్భుతమైన పంటలు పండుతున్నాయన్నారు. కరెంటుపై ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్కు అంత లాభమని హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి ఏపీలో పొన్నాల లక్ష్మయ్య విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే స్వంత గ్రామంలో మూడు గంటల కరెంటు రైతులకు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. మొదటి నుంచి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉందని విమర్శించారు.
'హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏపీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టుకు మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. తెలంగాణ ఖ్యాతిని దెబ్బతీస్తున్నారు' అని మంత్రి మండిపడ్డారు. 2009లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు గుర్తు చేశారు.
Zaheerabad Congress leaders Joined in BRS : తెలంగాణ మోడల్ కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌కు పోటీలేదని పేర్కొన్న ఆయన.. ఆయన ఎక్కడ పోటీ చేసినా ప్రజలు కళ్లకు అద్దుకొని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
ఇవీ చదవండి: