ETV Bharat / state

Harish Rao Tweet about Rythu Bandu : రూ.10 వేలు.. 10 విడతలు.. రూ.65వేల కోట్లు - హరీశ్‌రావు ట్వీట్

Rythubandhu completed five years in Telangana : రైతు బంధు రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తయినందున హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. రైతులకు ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇప్పటి వరకు 10 విడతల్లో డబ్బులు రైతుల ఖాతాలో వేశారని తెలిపారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 10, 2023, 7:30 PM IST

Rythubandhu completed five years in Telangana : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి నేటితో ఐదేళ్లు అయ్యాయని ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన రైతు బంధు వ్యవసాయాన్ని.. పండగ చేసి రైతన్నను రాజును చేసిందని ట్విటర్ వేదికగా హరీశ్‌రావు తెలిపారు. ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేశారని పేర్కొన్నారు. అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తున్నాయని వెల్లడించారు. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ బీఆర్‌ఎస్‌ను స్వాగతిస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు.

  • రైతుబంధుకు నేటితో ఐదేళ్లు.!

    సీఎం కేసీఆర్ గారి ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు వ్యవసాయాన్ని, పండగ చేసి రైతన్నను రాజును చేసింది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్… pic.twitter.com/2i7NyDgjxO

    — Harish Rao Thanneeru (@BRSHarish) May 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రైతు బంధు ఎప్పుడు ప్రారంభించారు: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు, రైతుల ఆదాయం సమకూర్చేందుకు, అప్పుల ఊబిలో అన్నదాతలు కూరిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 2018- 19 ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం(రైతు బంధు) అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ప్రతి సీజన్‌లో రైతుకు ఎకరానికి రూ.5 వేలు వారి ఖాతాలో వేస్తుంది. ఇప్పటి వరకు 10 విడతలుగా రాష్ట్రంలో ఉండే రైతులకు రూ.65 వేల కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కరోనా సమయంలోను కొనసాగిన రైతు బంధు: రైతు బంధు పథకాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కర్షకులకు ప్రతి విడతలో కచ్చితంగా నగదు జమా అయ్యేట్టు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కరోనా సమయంలోను రైతు బంధు పథకం నిలిపివేయలేదు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో రైతులకు కొంత వరకు ఆర్ధిక భారం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. కష్ట కాలంలో రైతులను ఆదుకోని.. ఎన్ని విమర్శలు వచ్చినా.. విజయవంతంగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ పథకం దేశానికే ఆదర్శంగా మారిందని బీఆర్ఎస్‌ నాయకులు గతంలో పలుమార్లు అన్నారు. రైతులకు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి పథకాలు అవసరమని సీఎం కేసీఆర్‌ గతంలో అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.