ETV Bharat / state

డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: హరీశ్​రావు - డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలి హరీశ్

Harish rao On Dengue: డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఇంటి చుట్టూ ఇంటి లోపల నీటి నిల్వలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం తన నివాసంలో 10 గంటలకు 10 నిమిషాలు డెంగీ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులతో కలసి ఇంటి అవరణలోని నీటి నిల్వలను మంత్రి పరిశీలించారు.

హరీశ్​రావు
హరీశ్​రావు
author img

By

Published : Sep 4, 2022, 2:35 PM IST

Harish rao On Dengue: డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఇంటి చుట్టూ ఇంటి లోపల నీటి నిల్వలు.. దోమల లార్వా పెరగకుండా చూసుకోవాలని సూచించారు. ఆదివారం తన నివాసంలో 10 గంటలకు 10 నిమిషాలు డెంగీ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులతో కలసి ఇంటి అవరణలోని నీటి నిల్వలను మంత్రి పరిశీలించారు.

దోమల నివారణకు ప్రజలు భాగస్వామ్యం కావాలని హరీశ్​రావు పేర్కొన్నారు. దోమ లార్వాను తోక పురుగులు అనుకోని వదిలివేయడం వల్ల దోమలు పెరుగుతున్నాయని తెలిపారు. సెప్టెంబర్, నవంబర్ నెలలో డెంగీ వ్యాధి నివారణ కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తన నివాసంలో డెంగీ వ్యాధి నివారణలో భాగంగా ఇంటి చుట్టూ ఉన్న నీటి నిల్వలను ఆయన తొలగించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా డెంగీ బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 3000 పైగా డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్​లో ఈ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నగరంలో ఇప్పటివరకు దాదాపు 13వేల వరకు డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందులో 1500 మంది వరకు పాజిటివ్​గా తేలటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

అంటే సుమారు 12 శాతానికిపైగా పాజిటివిటీ రేట్ ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ సహా ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలపై డెంగీ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్న పరిస్థితి. ఒకరి నుంచి మరొకరికి ఈ ఫ్లూ లక్షణాలు వేగంగా వ్యాపిస్తుండటంతో బాధితులు ఆస్పత్రులబాట పడుతున్నారు.

చిన్నపిల్లలపై డెంగీ తీవ్ర ప్రభావం: చిన్నపిల్లలపైనా డెంగీ తీవ్ర ప్రభావం చూపుతోంది. నీలోఫర్ ఆస్పత్రికి ఈ రోగం లక్షణాలతో నిత్యం వందల సంఖ్యలో వస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలోనూ ఇటీవల ఓపీ పెరిగింది. డెంగీ పగటిపూట కుట్టే దోమలతోనే వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతోపాటు... తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు ఉంటే తప్పక వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:పంజా విసురుతోన్న సీజనల్​ వ్యాధులు.. కలవరపెడుతోన్న డెంగీ మహమ్మారి

ఇస్రో కోసం రాకెట్ల తయారీ.. రూ.860 కోట్ల కాంట్రాక్టు ఎవరికి దక్కిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.