Harish Rao Give Clarification on Telangana Debts : ఎన్ని శ్వేత పత్రాలు పెట్టినా, ఎన్ని అంశాలు చర్చించినా మేము సమాధానం ఇచ్చేందుకు సిద్దమని, రాజకీయాల కంటే ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. స్వల్పకాలిక చర్చకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన సమాధానంపై వివరణలు కోరిన ఆయన, సత్య దూరమైన విషయాలు చెప్పారని ఆక్షేపించారు. రాష్ట్ర అప్పులు ఏడు లక్షల కోట్లు అని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఎస్పీవీల లోన్లు మినహాయిస్తే అప్పు(Telangana Debts) రూ.5,16,881 కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు వివరించారు. రానున్న మూడు నెలలది తీసివేస్తే ఐదు లక్షల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. సొంత ఆదాయ వనరుల్లో వృద్ధి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అంతేగానీ ఆస్తుల విలువ, జీఎస్‌డీపీ, పంటల ఉత్పత్తి, తలసరి ఆదాయం వంటి విలువలను చెప్పలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కరోనా, పెద్ద నోట్ల రద్దు(Demonetization), కేంద్ర సహాయ నిరాకరణ కారణంగా అంచనాలు, ఖర్చు విషయంలో అంతరం పెరిగిందని అన్నారు. నాటి పాలనలో సగంలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఆర్‌బీఐ ఇచ్చిన అవకాశాన్ని తీసుకున్నామని వివరించారు.
శ్వేతపత్రం మమ్మల్ని బద్నాం చేసేందుకేనన్న బీఆర్ఎస్ - వాస్తవాలు ప్రజలముందుంచామన్న అధికారపక్షం
MLA Harish Rao Speech at Assembly : ఓవర్ డ్రాప్ట్, వేస్ అండ్ మీన్స్ కు వెళ్లబోరని ఈ ప్రభుత్వం హామీ ఇస్తుందానని మాజీ మంత్రి హరీశ్‌రావు అడిగారు. రేవంత్ రెడ్డి సీఎం(CM Revanth Reddy)గా కాకుండా గాంధీభవన్‌లో మాట్లాడినట్లు సభలో మాట్లాడుతున్నారని, ప్రభుత్వం మంచి చేస్తే తాము కూడా సహకరిస్తామని తెలిపారు. కాళేశ్వరం రెండో టీఎంసీ కూడా కలిపి రూ.90 వేల కోట్లని సీఎం చెప్పినట్లు ఉందని అన్నారు.
White Paper on Economic Status of Telangana : ఈ సభలో అధికార పక్షం లక్ష కోట్లు కాలేదు, తాము చెప్పిందే సబబు అని ఒప్పుకున్నారని హరీశ్‌రావు వెల్లడించారు. లక్ష కోట్లు అని సభను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్థల ఆస్తులు భారీగా పెంచామని, ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలుకు అప్పులు చేశామని హరీశ్‌రావు సభాముఖంగా చెప్పారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము : రేవంత్ రెడ్డి
శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు