చీరలంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్లోకి ఏదైనా కొత్త రకం చీర వచ్చిదంటే చాలు ఆ చీరను ఎలాగైనా కొనాలని ఆసక్తి చూపుతారు. కానీ అలాంటి వారి ఉత్సుకతను షాపింగ్ మాల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. చీరలపై నకిలీ స్టికర్స్ వేసి డబ్బులు దండుకుంటున్నాయి. తాజాగా అధికారులు జరిపిన ఈ దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హైదరాబాద్ కొత్తపేటలోని ఓ షాపింగ్ మాల్‌లో హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ హ్యాండ్లూమ్ వస్త్రాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేశామని సంబంధిత అధికారి వెంకటేశం తెలిపారు. భారత ప్రభుత్వ చేనేత పరిరక్షణ చట్టం ప్రకారం.. 11 రకాల హ్యాండ్లూమ్ వస్త్రాలు తయారు చేసే అధికారాన్ని.. చేనేత కార్మికులకు రిజర్వ్ చేశామని చెప్పారు.
కానీ ఈ మాల్‌లో మరమగ్గాల నుంచి తయారైన వాటిని చేనేత వస్త్రాల పేరుతో ప్రింట్ చేసి విక్రయిస్తున్నారని గుర్తించామని పేర్కొన్నారు. అధికారులు వెల్లడించారు. ఇలాంటి మోసాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెంకటేశం తెలిపారు.
ఇవీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం
కాంక్రీట్ మిక్సర్, జేసీబీలతో పిండి కలిపి ప్రసాదం తయారీ.. అంతా టన్నుల్లోనే!