ETV Bharat / state

Handloom Declaration on August 7 : ఆగస్టు 7న చేనేత డిక్లరేషన్.. దిల్లీకి తరలుతున్న దేశవ్యాప్త చేనేత ప్రతినిధులు

Handloom Declaration on August 7 : దేశవ్యాప్తంగా చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న ఎర్రకోట నుంచి రాజ్​ఘాట్ వరకు హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించనున్నారు. ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న హెచ్చరించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 5, 2023, 8:01 PM IST

Handloom Section of All India Padmashali Society Meeting in Hyderabad : గత సంవత్సరన్నర కాలంగా అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం జరుగుతోంది. దీనికి కొనసాగింపుగా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం రోజున ఉదయం 8 గంటలకు ఎర్రకోట నుంచి రాజ్​ఘాట్ వరకు హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్​లో చేనేత డిక్లరేషన్​పై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కాన్ఫరెన్స్​కు వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు, దేశవ్యాప్తంగా చేనేత ప్రతినిధులు హాజరుకానున్నారు.

President of Handloom Section of All India Padmasali Association : తెలంగాణ భవన్​లో చేనేత నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేసిన ఉద్యమాలకు ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న హెచ్చరించారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించిన చేనేతలను విస్మరిస్తే పార్టీలకు భవిష్యత్​ ఉండదని అఖిల భారత పద్మశాలి యువజన సంఘం జాతీయ ఇంఛార్జీ అవ్వారి భాస్కర్ అన్నారు. బతుకు భారంగా జీవిస్తున్న చేనేత కళాకారులపై పన్నుల భారం మోపడం సరికాదని పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు స్వర్గం రవి అన్నారు. కేంద్రం స్పందించకుంటే తెలంగాణ ప్రాంతం నుంచి మరో ఉద్యమం ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షులు వాసాల రమేష్ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో స్వర్గం నర్సయ్య, చందుపట్ల పరంధాములు, విడపు రాజు, వేముల చంద్రశేఖర్, మంద రమేష్ , తావుటుమురళి, ఆయిల శంకర్, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

KTR: 'హైదరాబాద్‌లో చేనేత మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి'

Central Government GST on Handloom Department : చేనేత వస్త్రాలపై జీఎస్టీ ధరల్ని కేంద్ర ప్రభుత్వం అమాంతం పెంచేసింది. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయలేని స్థితికి ధరలు పెరిగిపోయాయి. దీంతో దేశంలో గిరాకీ పడిపోయింది. ఉన్న చీరలే అమ్మకాలు అనుకున్న రీతిలో అవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్న నేతన్నలకు.. కొత్త చీరల తయారీకి బ్రేక్ పడింది. ఈ కారణంగా పరోక్షంగా కార్మికులకు ఉపాధి తగ్గిపోతుంది. నెల రోజుల పాటు కష్టపడి చీరలు నేసినా రోజూ కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఉద్యమం చేస్తున్నారు.

చేనేత కార్మికుల వెతలు.. మారని బతుకులు

Pochampally silk sarees : ఉద్యోగం వదలి.. చేనేత వైపు కదిలాడు.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు

Handloom Entrepreneur : కష్టపడితే కానిదేముందని నిరూపిస్తున్న మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.