ETV Bharat / state

Hamstech Interior Design Expo : ఇంటీరియర్ ​మంత్ర.. చూపరులను కట్టిపడేస్తున్న ​హామ్స్​టెక్ ఎక్స్​పో - HomeTech Institute Latest News

Hamstech Interior Design Expo : సృజనాత్మకత ఉంటే వ్యర్థ ఉత్పత్తులను సైతం అందంగా తీర్చదిద్దవచ్చు. శిక్షణలో భాగంగా రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తూ ఈ విషయాన్ని నిజం చేశారు ఇంటీరియర్‌ డిజైన్‌ విద్యార్థులు. సంప్రదాయ, ఆధునిక మేళవింపుగా తయారు చేసిన ఫర్నిచర్‌ సందర్శకులను కట్టి పడేస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన స్పేస్ స్టోరీస్‌ ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంటోంది.

Interior
Interior
author img

By

Published : Jul 3, 2023, 10:54 PM IST

డిజైన్​మంత్ర.. చూపరులను కట్టిపడేస్తున్న ​ఇంటీరియర్ ఎక్స్​పో

Hamstech Interior Design Expo : హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో హామ్స్​టెక్ విద్యార్థులు.. ఇంటీరియర్‌ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్పేస్‌ స్టోరీస్‌ పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన పలు రకాల ఇంటీరియర్​ డిజైన్లు చూపరులను మంత్రమగ్ధులను చేస్తున్నాయి. ఇందులో సోఫా సెట్స్, హోంలైట్స్ విభిన్న రకాలుగా రూపొందించి ఔరా అనిపించారు. దాదాపు 300 మంది విద్యార్థులు.. 1000కి పైగా ఉత్పత్తులను ప్రదర్శించి శభాష్‌ అనిపించారు.

చాలా మంది యువత సృజనాత్మకత రంగాన్నే తమ కెరియర్​గా ఎంచుకుంటారని.. అందులోనూ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులపై.. ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారని హామ్స్​టెక్ ఇనిస్టిట్యూట్‌ ఎండీ అజితారెడ్డి అన్నారు. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే ఈ ఉత్పత్తులను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆమె తెలిపారు.

వార్షికోత్సవంలో భాగంగా ప్రతీ ఏడాది ఇంటీరియన్‌ డిజైన్‌ ప్రదర్శన నిర్వహిస్తారని విద్యార్థులు చెబుతున్నారు. దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు శ్రమించి వీటిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇంటీరియర్‌ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుందన్నారు. కేవలం వారం రోజుల సమయం ఇచ్చి.. ఒక థీమ్‌ ఇస్తారని పేర్కొన్నారు. దీని ద్వారా విభిన్న రకాలుగా డిజైన్‌లు చేయడం నేర్చుకుంటారని.. ఇలా ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా మార్కెట్‌ విధానం తెలుస్తుందని విద్యార్థులు వెల్లడించారు.

వీటి తయారికి పూర్వ వస్తువులను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. వీటి పనితనం, నాణ్యతతో పాటు ఆరోగ్యపరంగా అన్నీ జాగ్రత్తులు తీసుకున్నట్లు వివరించారు. సృజనాత్మకత.. కొత్తగా ఏదైన చేయాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు ఈ రంగంను కెరియర్​గా ఎంచుకోవచ్చు అని విద్యార్థులు సూచిస్తున్నారు.

" నేడు చాలా మంది యువత సృజనాత్మకత రంగాన్నే తమ కెరియర్​గా ఎంచుకుంటున్నారు. అందులోనూ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉత్పత్తులను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు". - అజితారెడ్డి, హామ్స్​టెక్​ ఎండీ

"హామ్స్​టెక్ వార్షికోత్సవంలో భాగంగా ప్రతీ ఏడాది ఇంటీరియన్‌ డిజైన్‌ ప్రదర్శన నిర్వహిస్తారు. ఇంటీరియర్‌ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది. కేవలం వారం రోజుల సమయం ఇచ్చి.. ఒక థీమ్‌ ఇస్తారు. ఇచ్చిన అంశంకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్​ చేస్తాము. ఇది నిజంగా మంచి అనుభవం." - హామ్స్​టెక్​, విద్యార్థులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.