ETV Bharat / state

'విశ్వవిద్యాలయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది'

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా‌ ఉన్న ఉపకులపతి, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకుండా విద్యార్థులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని... ఏబీవీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు వినోద్​ అన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ జేఎన్​టీయూ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

Half-naked demonstration of ABVP leaders in front of  JNTU Hyderabad
'విశ్వవిద్యాలయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది'
author img

By

Published : Mar 16, 2021, 4:59 PM IST

రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీల పట్ల సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని... ఏబీవీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు వినోద్​ తెలిపారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. హైదరాబాద్ జేఎన్​టీయూ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా‌ ఉన్న ఉపకులపతి, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకుండా విద్యార్థులకు... సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: ఎల్లంపల్లి నీటి కోసం మత్స్యకారుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.