రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకి పెరుగుతుండటంతో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 12 వరకు ఒంటి పూట తరగతులు కొనసాగుతాయని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తరగతులు జరగనున్నాయి. అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 12 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.
ఇవీ చూడండి:ఎర్రకోటపై జెండా ఎగరేద్దాం..