ETV Bharat / state

'వారం రోజుల ముందే విద్యార్థులు వసతి గృహాలకు చేరుకోవాలి' - Gurukula schools updates

రాష్ట్రంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంటే... మరోవైపు అధికారులు పదోతరగతి పరీక్షల ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమైయ్యారు. విద్యార్థులకు కరోనా వైరస్​ సోకకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గురుకుల విద్యార్థులు పరీక్షలకు వారం రోజుల ముందుగానే వసతి గృహాలకు చేరుకునేలా చూడాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ అధికారులను ఆదేశించారు. అలాగే మాస్క్​ ధరిచంకపోతే ఎట్టిపరిస్థితుల్లోనూ వసతి గృహాలతోపాటు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని స్పష్టం చేశారు.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : May 30, 2020, 7:26 PM IST

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. జూన్​ 8 నుంచి పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ – కరోనా వైరస్ కట్టడి చర్యలపై దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్​లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా, జడ్ చోంగ్తులతో మంత్రి సమీక్షించారు.

రివైస్డ్ సిలబస్ మేరకు పరీక్షల నిర్వహణ...

కరోనా నియంత్రణ కోసం వాయిదా పడిన పరీక్షలు తిరిగి నిర్వహించనున్న సందర్భంగా రివైస్డ్ సిలబస్ మేరకు పరీక్షలు జరుగుతాయని మంత్రికి అధికారులు తెలిపారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలోని విద్యాలయాల్లోని 2,949 మంది విద్యార్థులకు 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

కరోనా వైరస్​ చాప కింద నీరులా విజృంభిస్తోన్న నేపథ్యంలో పరీక్షల కోసం వచ్చే విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సత్యవతి రాఠోడ్​ స్పష్టం చేశారు. పరీక్షలకు వారం రోజుల ముందే విద్యార్థులు వసతి గృహాలకు చేరుకునేలా చూడాలన్నారు. వసతి గృహానికి వచ్చే ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేసి, వారం రోజుల పాటు వారిని పరిశీలించాలన్నారు.

ప్రతి విద్యార్థికి రెండు మాస్క్​లు ఇవ్వాలి...

రోగ నిరోధకత పెంచే పోషకాహారాన్ని విద్యార్థులకు అందించాలని మంత్రి సూచించారు. అలాగే ప్రతి విద్యార్థికి విధిగా రెండు మాస్క్​లు, ఒక శానిటైజర్ అందించాలన్నారు. విద్యార్థులు చదువుకునే సమయంలో కూడా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వచ్చే విద్యార్థులకు సహకరించేందుకు సంబంధిత సబ్జెక్ట్ టీచర్లు కూడా జూన్ 1 నుంచి విధులకు హాజరు కావాలన్నారు.

ప్రభుత్వ వాహనాల్లోనే తీసుకెళ్లాలి...

వసతి గృహాల నుంచి పరీక్షా కేంద్రాల వరకు విద్యార్థులను టీచర్లు, అధికారులు దగ్గరుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే తీసుకెళ్లాలన్నారు. వసతి గృహాలు, పరీక్షా కేంద్రాల్లోనూ శానిటైజర్, మాస్క్ ధరించకపోతే అనుమతించకూడదని ఆదేశించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం స్థానిక హెల్త్ సెంటర్​తో సమన్వయం చేసుకోవాలన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ కేంద్ర కార్యాలయం నుంచి పనిచేస్తున్న పినాకి హెల్త్ కమాండ్ సెంటర్ సేవలను సిబ్బంది, అధికారులను వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.