భాగ్యనగరాన్ని భారీ వర్షాలు వణికిస్తోన్నాయి. తాజాగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ పాతబస్తీ శివారులోని గుర్రం చెరువు కట్ట తెగిపోయింది. కట్ట తెగడం వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.
ఉప్పుగూడ, సాయిబాబా నగర్, శివాజీనగర్, బాబా నగర్ బస్తీలను వరద ముంచెత్తింది. నీరు రావటంతో ప్రజలు కట్టుబట్టలతో బయటకు వస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీ చదవండి: వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం