ప్రభుత్వం గోనె సంచుల టెండర్లను రద్దు చేసింది. 'గోనె సంచుల టెండర్లలో గుత్తేదారులు కుమ్మక్కు' అనే శీర్షికన ఈనాడులో వచ్చిన కథనానికి స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గోనె సంచుల కొనుగోలుకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వీటిపై ఆరోపణలు రావటంతో మళ్లీ టెండర్లు పిలువనుంది.
ఇదీ చదవండి: ఆయనకు తెలియకుండానే రూ.6లక్షలు లోన్ ఎలా తీశారు?