గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. రమాదేవి అనే మహిళపై సైనికోద్యోగి బాలాజీ కాల్పులు జరిపాడు. ఆమె కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా బాలాజీ వెంటపడుతున్నాడు. ఇందుకు ఆమె నిరాకరించిన కారణంగా.. ఇవాళ తెల్లవారుజామున ఇంటికి వచ్చి కాల్పులు జరిపాడు. తుపాకీ చూసి అప్రమత్తమై పక్కకు జరిగిన రమాదేవి ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం బాలాజీ పరారీలో ఉన్నాడు. అతనికి సహకరించిన ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: