ETV Bharat / state

గల్ఫ్​ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి : వినోద్

బతుకుదెరువు కోసం గల్ఫ్​ దేశాలకు వెళ్లిన కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ప్రణాళిక సంఘం వైస్​ఛైర్మన్ బోయినపల్లి వినోద్​కుమార్ అన్నారు. గల్ఫ్ కష్టాల నుంచి కాపాడాలంటూ వలస కార్మికుల సంఘాల ప్రతినిధులు హైదరాబాద్​లో కలిసి వినతిపత్రం సమర్పించారు.

gulf workers union leaders meet  Planning Commission Vice Chairman Boinapalli Vinod Kumar in hyderabad
బోయినపల్లి వినోద్​కుమార్​ను కలిసిన గల్ఫ్​ వలస కార్మికుల సంఘాల నాయకులు
author img

By

Published : Jan 12, 2021, 8:41 PM IST

గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారి కష్టాలు తనకు తెలుసని ప్రణాళికసంఘం వైస్​ఛైర్మన్ బోయినపల్లి వినోద్​కుమార్ అన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తమను కష్టాల నుంచి కాపాడాలంటూ గల్ఫ్​ వలస కార్మికుల సంఘాల నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు.

గల్ఫ్​ కార్మికుల కోసం రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. మృతిచెందిన వారి భౌతికకాయాన్ని ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ జైలులో మగ్గుతున్న ప్రవాసులకు బీమా సౌకర్యం కల్పించాలని, స్వదేశానికి తిరిగి వచ్చే వారికి ఉపాధి చూపాలని వినోద్‌కుమార్‌ను కోరారు. మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : అనుమతి లేని ప్రాజెక్టుల పనులు ఆపేయండి : కృష్ణాబోర్డు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.