ETV Bharat / state

Sneh milan in Ramoji Film City: రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా గుజరాతీల స్నేహమిలాన్ - Sneh milan in Ramoji Film City

'ది గుజరాత్‌ సోషల్‌ వెల్‌ఫేర్‌ సొసైటీ(The Gujarat Social Welfare Society)' ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ కలయికకు.. రామోజీ ఫిల్మిసిటీ (Ramoji Film city news) వేదికైంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిసరాల్లోని గుజరాతీలు ఈ కార్యక్రమానికి హాజరై ఆనందంగా గడిపారు. ఫిల్మ్‌సిటీ అందాలను వీక్షించారు.

Sneh milan in Ramoji Film City
రామోజీ ఫిల్మ్‌సిటీలో స్నేహమిలాన్.. ఆహ్లాదంలో గుజరాతీలు
author img

By

Published : Nov 15, 2021, 4:05 PM IST

రామోజీ ఫిల్మ్‌సిటీలో స్నేహమిలాన్

'స్నేహ మిలాన్‌' పేరిట ఏడాదికి నాలుగు సార్లు గుజరాతీలు వేడుకను జరుపుకుంటారు. కృష్ణాష్టమి, హోళీ, రాఖీ, దీపావళి రోజుల్లో... ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తారు. పనిలో ఎంత బిజీగా ఉన్నా.... ఈ కార్యక్రమానికి మాత్రం కచ్చితంగా హజరై.... సభ్యులతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడుపుతారు. ఈసారి దీపావళి స్నేహమిలాన్‌(sneh milan)ను రామోజీ ఫిల్మ్‌సిటీ(Ramoji Film city news)లో ఎంతో వైభవంగా నిర్వహించారు.

రామోజీఫిల్మ్‌సిటీలో స్నేహమిలాన్‌

70, 80 ఏళ్ల క్రితమే చాలా మంది గుజరాతీలు ఇక్కడకు వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలా కొన్నేళ్లకు 'ది గుజరాత్‌ సోషల్‌ వెల్‌ఫేర్‌ సొసైటీ'ని ఏర్పాటు చేసి... ఈ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సొసైటీ సభ్యత్వం తీసుకున్న గుజరాతీలకు ప్రభుత్వ పథకాల్లానే ఎన్నో స్కీంలు పెట్టి ఆదరిస్తున్నారు. కొవిడ్‌ సమయంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సొసైటీ 37సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున….. స్నేహమిలాన్‌ను రామోజీఫిల్మ్‌సిటీలో నిర్వహించినట్లు సంఘం అధ్యక్షుడు జిగ్నేష్‌ దోసి తెలిపారు.

మా ది గుజరాత్‌ సోషల్‌ వెల్‌ఫేర్‌ సొసైటీ(The Gujarat Social Welfare Society)'లో దాదాపు 3వేల 500 మంది ఉన్నారు. ఎవరికైనా లోన్ కావాలంటే తక్కువ వడ్డీకి తీసుకోవచ్చు. ఎవరైనా చనిపోతే... 24 గంటల్లో వారి కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తాం. ఆడపిల్ల పుడితే లక్ష 31వేల రూపాయలు అందిస్తాం. ఆడబిడ్డ పెళ్లికి 21 వేల రూపాయలు ఇస్తున్నాం. సోసైటీలో ఉన్నవారికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది.

- జిగ్నేష్​ దోసి, సంఘం అధ్యక్షుడు

వారికి అండగా గుజరాతీలు

ఆడపిల్లలు పుట్టినప్పుడు, వారి పెళ్లికి, కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆర్థిక సాయం చేస్తూ.. వారి ఉనికిని చాటుకుంటున్నారీ ఈ గుజరాతీలు. సంఘం సభ్యత్వం తీసుకున్నవారిలో పేదవారు ఉంటే వారికి తక్కువ వడ్డీకే రుణం ఇవ్వడంలాంటివి చేస్తూ అండగా ఉంటున్నారు. ఏడాదికి నాలుగుసార్లు ఇలా స్నేహమిలాన్‌ను జరుపుకుని హాయిగా గడుపుతామని వారంటున్నారు.

మేం మొత్తం ఫ్యామిలీ వచ్చాము. మేము అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ రావాలి. అందరూ ఎంజాయ్ చేయాలి. రామోజీ ఫిల్మ్​ సిటీకి చాలా సార్లు వచ్చాం. బహుబలి సెట్​ చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మువీ సెట్లు అన్ని బాగున్నాయి.

- పర్యటకులు

వేడుకలో మూడు వేల మంది

చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు 3వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ఫిల్మ్‌సిటీలో ఈ వేడుకను నిర్వహించడంపై హర్షంవ్యక్తం చేశారు. ఇక్కడున్న సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారులు మరింత ఉత్సాహంగా గడిపారు. ముఖ్యంగా బాహుబలి సెట్‌ను చూడటం.. జీవితంలో మరిచిపోలేని అనుభూతి అంటూ ఎగిరి గంతేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.