ETV Bharat / state

తోకలేని ఎలుక గురించి విన్నారా? - తోకలేని ఎలుక గురించి విన్నారా!

కాస్త కుందేలులా.. ఇంకాస్త ఎలుకలా కనిపించే గినియా పిగ్ గురించి విన్నారా! అచ్చం పంది మొహాన్ని పోలిన ఈ జీవి నిజానికి ఎలుక జాతికి చెందినది. దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి మరి!

guinea pig looks like rabbit and rat with out tale
తోకలేని ఎలుక గురించి విన్నారా!
author img

By

Published : Jun 7, 2020, 5:52 PM IST

ఓ వైపు నుంచి కుందేలు.. మరోవైపు నుంచి ఎలుకలా కనిపిస్తున్న నా పేరు గినియా పిగ్. అయ్యో! పంది అని మొహం చిట్లించుకోకండి. నిజానికి నేను ఎలుక జాతి జీవిని. కాస్త విచిత్రంగా ఉంది కదూ! నా గురించి మరిన్ని విశేషాలు చెబుదామనే.. ఇలా వచ్చా...

  • నా పుట్టినిల్లు దక్షిణ అమెరికా
  • ప్రస్తుతం నేను దాదాపు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించా
  • నన్ను కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో పెంచుకుంటారు. ఆహారంగానూ తీసుకుంటారు. వ్యాధులపై మందులు, టీకాల పనితీరు తెలుసుకునేందుకు ఎలుకలు, కుందేళ్లతోపాటు మమ్మల్నీ ప్రయోగశాలల్లో ఉపయోగిస్తుంటారు.
  • నేను ఎలుక జాతి జీవినని ముందే చెప్పాగా.. కానీ నాకు తోక మాత్రం ఉండదు
  • రోజులో చాలా సమయం తింటూనే ఉంటా
  • నేను కొన్నిసార్లు అచ్చం పందిలాగే శబ్ధాలు చేస్తుంటా.. అందుకే నన్ను గినియాపిగ్​ అని మీరు పిలుచుకుంటారు

నా బరువు ఎంతంటే..

  • 700 గ్రాముల నుంచి 1,200 గ్రాముల మధ్య బరువుంటా
  • మాలో కొన్ని అరుదుగా దాదాపు 3 కిలోల వరకూ పెరుగుతాయి
  • 20 నుంతి 25 సెంటీ మీటర్ల పొడవుంటా
  • నా సగటు జీవిత కాలం 4 నుంచి 5 సంవత్సరాలు. కొన్ని 8 సంవత్సరాల వరకూ బతుకుతాయి
  • నాకు పచ్చని గడ్డంటే చాలా ఇష్టం
  • లేత మొక్కల ఆకులు, కాండాలూ తింటాను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.