ETV Bharat / state

'ప్లాస్మా థెరపీపై సినీ నటులు విస్తృతంగా ప్రచారం చేయాలి'

కొవిడ్​తో బాధపడుతున్న వారిని కాపాడేందుకు సినీ నటులు తమ వంతు కృషి చేయాలని ప్లాస్మా సంఘం అధ్యక్షుడు గూడూరు నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా థెరపీపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.ప్లాస్మా థెరపీ కొవిడ్ రోగులకు ప్రాణదాత లాంటిదని గూడూరు తెలిపారు.

guduru narayanareddy urged cini actors to campaign on plasma therapy

author img

By

Published : Jul 25, 2020, 6:14 PM IST

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దపెద్ద హీరోలు హీరోయిన్లు ప్లాస్మా థెరపీపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు గూడూరు నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌తో బాధపడుతున్న వారిని కాపాడేందుకు తమ వంతు సాయం చేసిన వారవుతారని గూడూరు పేర్కొన్నారు. సినీ ప్రముఖులకు గుర్తింపు తెచ్చిపెట్టటమే కాకుండా... కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చే ప్రజల కోసం తమ సమయాన్ని కేటాయించాలని కోరారు.

కరోనాతో బాధపడుతున్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని సినీ నటులను కోరారు. ప్లాస్మా దాతలు డొనేట్ చేసేందుకు ప్రేరేపితం చేసి, భరోసా కల్పించే మాటలతో చిన్న చిన్న వీడియోలు చేయడం ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. ప్లాస్మా థెరపీ కొవిడ్ రోగులకు ప్రాణదాత లాంటిదని గూడూరు తెలిపారు.

ఇదీ చదవండిః కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.