ETV Bharat / state

'రాజ్యాంగానికి లోబడి పనిచేయండి... రాజకీయ నేతల కోసం కాదు' - ts rtc strike issue

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించొద్దని సీనియర్‌ అధికారులకు కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించొద్దని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

'రాజ్యాంగానికి లోబడి పనిచేయండి... రాజకీయ నేతల కోసం కాదు'
author img

By

Published : Oct 30, 2019, 10:00 PM IST

సీఎం కేసీఆర్‌ ఒత్తిడితోనే బ్యూరోక్రాట్లు, ఇతర అధికారులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. వాస్తవ గణాంకాలను దాచి...తప్పుడు వివరాలను న్యాయస్థానానికి ఇచ్చారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వప్రయోజనాలను పరిరక్షించడానికి కాకుండా....చట్టానికి, రాజ్యాంగానికి లోబడి అధికారులు పని చేయాలని గూడూరు సూచించారు. యాభైవేల మంది ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న పోరాటం..కార్పొరేషన్ మనుగడకే పరిమితం కాదన్న ఆయన... ఈ నెల 31వ తేదీ లోపల సమగ్ర వివరాలు న్యాయస్థానానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: ప్రశ్నించే గొంతును నులిమేస్తారా..? చాడా వెంకట్​రెడ్డి

TG_HYG_44_30_CONG_ON_RTC_AV_3038066 Reporter: Tirupal Reddy Dry ()రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్నితప్పుదారి పట్టించొద్దని సీనియర్‌ అధికారులకు కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు ఎవరు కూడా చట్టాన్నిఉల్లంఘించొద్దని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఒత్తిడితోనే బ్యూరోక్రట్లు, ఇతర అధికారులు న్యాయస్థానాన్నితప్పుదోవ పట్టిస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. వాస్తవ గణాంకాలను దాచి...తప్పుడు వివరాలను న్యాయస్థానానికి ఇచ్చారని ద్వజమెత్తారు. ఆర్టీసీని ప్రయివేటు పరం చేసి..వేల కోట్ల విలువైన ఆర్టసీ ఆస్తులను కొట్టేయాలని సీఎం కేసీఆర్‌ ముందే నిర్ణయించుకున్నందునే హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేలా అధికారులు వ్యవహరించినా...తప్పుడు వివరాలు అందించినా...అసంపూర్ణమైన సమాచారాన్ని ఇచ్చినా... కోర్టు ధిక్కారం కింద హైకోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వప్రయోజనాలను పరిరక్షించడానికి కాకుండా....చట్టానికి, రాజ్యాంగానికి లోబడి అధికారులు పని చేయాలని గూడూరు సూచించారు. శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రజలందరికీ ఉద్దేశించినవి...అవన్నీ కూడా రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రాజకీయ అవసరాలకు అనుగుణంగా చట్టాలను ఉల్లంఘించడం..నిబంధనలను ప్రకారం నడుచుకోకపోవడం ఐఎఎస్ అధికారులు తమ కర్తవ్యానికి అన్యాయం చేసినట్లేనని ఆయన పేర్కొన్నారు. యాభైవేల మంది ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న పోరాటం..కార్పొరేషన్ మనుగడకే పరిమితం కాదన్న ఆయన ఈ నెల 31వ తేదీ లోపల సరియైన సమగ్ర వివరాలను న్యాయస్థానానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.