హైదరాబాద్ గుడిమల్కాపూర్ డివిజన్లో బస్తీ బాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బంగారి ప్రకాశ్, జీహెచ్ఎంసీ ఉపకమిషనర్ ఎంకే అలీ, ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆయా కాలనీల్లో సమస్యలను స్వీకరించిన అధికారులు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
జడ్పూర్ మైసమ్మ ఆలయం నుంచి ఆర్యసమాజ్, కమల్ సింగ్ పార్క్, రంసింగు పుర, ఉప్పర్ బస్తీ, లాల్‌బహదూర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్, డీఈ అశోక్ కుమార్, ఏఈఈ నంద, జలమండలి అసిస్టెంట్ మేనేజర్ మురళి పాల్గొన్నారు.
- ఇదీ చూడండి దేశంలో వరుస అత్యాచారాల కలకలం