ETV Bharat / state

Gruha Lakshmi scheme Telangana : ఆగస్టు నుంచి పట్టాలెక్కనున్న 'గృహలక్ష్మి పథకం'

Telangana Gruha Lakshmi scheme 2023 : సొంతస్థలం ఉండి.. ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపేవారికి మంచిరోజులు వచ్చాయి. గృహలక్ష్మి పేరిట రాష్ట్ర సర్కారు రూపొందించిన నూతన పథకం ఆగస్టు నుంచి పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి స్థూల మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. దీని అమలుకు సంబంధించిన కార్యాచరణ విధానాలు ఖరారవ్వాల్సి ఉంది.

Gruhalakshmi Scheme In Telangana
Gruhalakshmi Scheme In Telangana
author img

By

Published : Jul 14, 2023, 7:10 AM IST

ఆగస్టు నుంచి పట్టాలెక్కనున్న 'గృహలక్ష్మి పథకం'

Gruha Lakshmi Scheme Telangana 2023 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఏటా 4 లక్షల మందిని ఎంపిక చేసి సొంతస్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చేవారికి 3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గం నుంచి 3000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎంపికైన లబ్ధిదారులకు 3 దశల్లో ఆయా మొత్తాలను విడుదల చేసేందుకు నిర్ణయించింది.

ఏ లబ్ధి పొందని వారికే తొలి ప్రాధాన్యం : గృహలక్ష్మి అమలుకు కార్యాచరణ విధానాలను రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకోసం అధికారులు కసరత్తు చేపట్టారు. ఏ ప్రభుత్వ పథకంలోనూ లబ్ధి పొందని వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ మైనార్టీలకు 50 శాతం ఇవ్వాలని సర్కారు స్పష్టం చేసింది. మిగిలిన 20 శాతాన్ని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వనుంది. కార్యాచరణ విధానాల రూపకల్పనలో మున్సిపల్, పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖ ఉన్నతాధికారులను భాగస్వాములను చేయనుంది. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో వారు ఉన్నారు.

Telangana Gruha Lakshmi Scheme : ఆగస్టు చివరివారం నుంచి లబ్ధిదారుల దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు మంత్రిస్థాయిలో మథనం చేసి.. ముసాయిదా విధానాలను సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారులు అందజేస్తారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేశాక తుది ఉత్తర్వులు వెలువడతాయని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3000 మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం అందచేయనున్నందున.. మిగిలిన దరఖాస్తుదారులకు ప్రాధాన్యక్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు చేసుకునేందుకు తుది గడువును కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక ప్రకటించే అవకాశం ఉంది.

Gruhalakshmi Scheme 2023 : గృహలక్ష్మి కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం వాటిని పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్దిదారులకు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆధర్యంలో దశల వారీగా గృహలక్ష్మి వర్తింపజేస్తారు. ఆర్థికసాయం అందించగా మిగిలిన వారిని వెయిటింగ్ లిస్ట్​లో పెట్టి భవిష్యత్​లో ఆర్థికసాయం అందిస్తారు. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదంతో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గృహలక్ష్మి పథకం అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొస్తారు.

Vemula Prashanth Reddy on Gruhalakshmi Scheme : పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ ప్రధానాశయమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన సందర్బంగా సీఎం కేసీఆర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గృహలక్ష్మి పథకం కేసీఆర్ సర్కార్ పేదలకు అందిస్తున్న వరం లాంటిదని కొనియాడారు. కేసీఆర్ మానస పుత్రిక గృహలక్ష్మి పథకమన్న ఆయన.. సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్దిదారులకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.