ETV Bharat / state

మహిళలకు భరోసా... పోకిరీలపై షీ టీమ్స్​ ఉక్కుపాదం

మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలపై షీ బృందం పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ పోకిరీల నుంచి మహిళలు వేధింపులు ఎదుర్కొన్నారు. ఏప్రిల్‌, మే రెండు నెలల్లో సైబరాబాద్‌ షీ బృందాలకు మొత్తం 255 ఫిర్యాదులొచ్చాయి. పోలీసులు కేసులు నమోదు చేసి పోకిరీలను అరెస్టు చేసి ఊచలు లెక్క బెట్టేలా చేస్తున్నారు.

growing-cases-to-shee-teams in lockdaown time
మహిళలకు భరోసా... పోకిరీలపై షీ టీమ్స్​ ఉక్కుపాదం..
author img

By

Published : Jun 11, 2020, 2:15 PM IST

లాక్​డౌన్​ సమయంలోనూ.. మహిళలు, యువతులకు వేధింపులు తప్పలేదు. లాక్​డౌన్​ అమల్లో ఉన్న రెండు నెలల్లో వేధింపులపై 225 ఫిర్యాదులు షీబృందాల పోలీసులకు అందాయంటే.. పరిస్థితి అర్థమవుతోంది. వాట్సాప్​, ఈమెయిల్​, హాక్​ఐ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు నేరుగా కూడా బాధితులు షీ బృందాల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే పోలీసులు స్పందించి కేసులు నమోదు చేస్తున్నారు.

మొత్తం 28 కేసులు

మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అందిన ఫిర్యాదుల్లో 28 కేసులు నమోదు చేశారు. వీటిలో 19 క్రిమినల్​ కేసులు, 9 సాధారణ కేసులు నమోదయ్యాయి.

కేసుల వివరాలు

  • గత నెల 16న అడ్వర్ట్​టైజ్​మెంట్​ ఏజెన్సీ యజమాని యువతిని ఫోట్​ షూట్​ పేరిట వేధించాడు. దీనితో బాధిత యువతి షీ బృందాల పోలీసులకు వాట్సాప్​ ద్వారా ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని ఆధారాలు సేకరించి సదరు యజమానిపై రాయదుర్గం పీఎస్​లో కేసు నమోదు చేశారు.
  • మరో ఘటనలో యువతిని ప్రేమ పేరుతో అభి అనే వ్యక్తి వేధించాడు. తనను వివాహం చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దీనితో యువతి అతనితో స్నేహం చేసింది. ఇదే అదనుగా యువతి ఫోటోలు బాధితుడు తీసుకున్నాడు. అతని ప్రవర్తన నచ్చని ఆమె... దూరంగా ఉంటూ వచ్చింది. యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెదుకుతుండటం వల్ల విషయం తెలిసిన అతను యువతి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తానంటూ బెదిరించాడు. దీనితో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.
  • ఎస్సార్​నగర్​కు చెందిన హోమియో వైద్యుడు మహిళను వైద్యం పేరిట వేధించాడు. బాధితురాలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వైద్యుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

పోకిరీల బారిన పడే బాధిత మహిళలు సైబరాబాద్​ షీ బృందాల పోలీసుల వాట్సాప్​ నంబర్​ 9490617444 లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. బాధితుల వివరాలు బయటకు వెల్లడించకుండా చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.