![వంటపడుతున్న ఒంటె పాలు..](https://assets.eenadu.net/article_img/19hyd-story4a_7.jpg)
ఆవు పాలు, బర్రె పాలు మనకు తెలుసు. అలాగే మేక పాలు కూడా తాగుతారని తెలుసు. వేమన పద్యంలో కడివెడైన నేమి ఖరము పాలు అని చదువుకున్నాము. కానీ ఈ ఒంటె నుంచి పాలు తీయడం, ఆహారంగా తీసుకుంటారని చూసి ఉండము. అలాంటిది రాజస్థాన్ నుంచి వలస వచ్చిన వారు ఇలా ఒంటెల నుంచి పాలు తీసి విక్రయిస్తున్నారు.
![Growing camel milk sales in HYDERABAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10312518_keee.jpg)
రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో ఇది సాధారణ విషయమే. కానీ ఇప్పుడిప్పుడే నగరవాసులు ఈ పాలు రుచిచూస్తున్నారు. వీటిని సాధారణ గృహ అవసరాలకు వాడతామని.. రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇస్తుందని విక్రయదారుడు ప్రవీణ్ తెలిపారు. రక్తంలో చక్కర సమస్య ఉన్నవారికి ఈ పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. పెద్ద పెద్ద మాల్స్‌లో, ఈ కామర్స్‌లో లభ్యమవుతున్న ఈ ఒంటెపాలు ఎలా తీస్తారో అన్నది ఆసక్తి కరమే. అంతెత్తు ఒంటె నుంచి నిల్చుని పాలు తీయాలి. అందుకు చిన్న చిన్న గిన్నెలు ఉపయోగిస్తారు. పెద్ద పాత్రలో ఒకేసారి పాలు పిండితే నిల్చున్నప్పుడు ఆ బరువు ఆపటం కష్టమవుతోంది. ఖాళీ సమయంలో మగ ఒంటెలపై పిల్లల్ని ఎక్కించి తిప్పి ఆదాయం పొందుతున్నారు.