Group2 Postpone Telangana Election 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 3 నుంచి డిసెంబర్ 3 వరకు ఉన్న ఈ షెడ్యూల్.. రాష్ట్రంలో వివిధ ఉద్యోగ భర్తీ పరీక్షలపై ప్రభావితం చూపుతోంది. ముఖ్యంగా నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూపు 2, నవంబర్ 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సిన టీఆర్‌టీ-ఎస్‌జీటీ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
TSPSC Group 2 Exam Reschedule Dates : గ్రూప్- 2 పరీక్ష రీషెడ్యూల్.. కొత్త తేదీలివే
Telangana Group 2 Exam Postpone 2023 : నవంబరు 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. గ్రూపు-2 పరీక్షకు పెద్ద సంఖ్యలో పోలీస్, ఇతర శాఖల సిబ్బందిని కేటాయించడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 గ్రూపు-2 పోస్టుల కోసం దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొత్తం 1,600 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు దాదాపు 25 వేల మంది పోలీసులు, 20 వేల మంది పరీక్ష సిబ్బంది కావాలి. అభ్యర్థులకు తగిన రవాణా ఏర్పాట్లు కల్పించాలి. అలా కాకుండా.. ఒకవేళ ఎగ్జామ్ను వాయిదా వేస్తే.. డిసెంబర్ మూడో వారంలో నిర్వహించే అవకాశాలనూ పరిశీలిస్తోంది.
TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు
ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో గ్రూపు-2 ఎగ్జామ్ నిర్వహణ ఏర్పాట్లపై టీఎస్పీఎస్సీ కమిషన్ పలువురు జిల్లా అధికారులతో సోమవారం చర్చలు జరిపింది. ఎలక్షన్స్ కారణంగా పరీక్ష కోసం సిబ్బంది సర్దుబాటు కష్టమని కలెక్టర్లు కమిషన్కు సూచించినట్లు తెలిసింది. రిటర్నింగ్, పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ అధికారుల నియామకం సాధ్యం కాదని వివరించారు. 2 రోజుల పాటు వరుసగా 4 సెషన్లలో పరీక్షల నిర్వహణకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కమిషన్ మరోసారి సమావేశమై.. పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Telangana TRT Exams 2023 : మరోవైపు టీఆర్‌టీ (టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్)లో భాగమైన ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్స్) పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 20 నుంచి 24 వరకు స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీ పోస్టులకు, నవంబరు 25 నుంచి 30 వరకు ఎస్‌జీటీ పరీక్షలు నిర్వహించాలి. నవంబర్ 30న పోలింగ్ నేపథ్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని.. అందువల్ల టీఆర్‌టీ నిర్వహణపై దృష్టి పెట్టడం సాధ్యం కాకపోవచ్చునని విద్యా శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కనీసం ఎస్‌జీటీ పరీక్షలను వాయిదా వేయక తప్పదని.. 20 నుంచి 24 వరకు ఉన్న పరీక్షలకు ఇబ్బంది లేకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ పరీక్షలు ఇప్పుడు వాయిదా పడితే.. మళ్లీ వచ్చే ఫిబ్రవరిలోనే నిర్వహిస్తారని సమాచారం.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..