ETV Bharat / state

GROUP-1 KEY: గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఫైనల్​ కీ విడుదల.. - Group1 Latest News

GROUP-1 KEY RELEASE: గ్రూప్​ వన్ అభ్యర్థులకు గుడ్​న్యూస్. టీఎస్​పీఎస్సీ పరీక్ష ప్రిలిమినరీ కీ షీట్ విడుదల చేసింది. ప్రాథమిక సమాధానాలపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు.

గ్రూప్ వన్ ప్రిలిమినరీ తుది మాస్టర్​ కీ విడుదల..

author img

By

Published : Nov 15, 2022, 10:36 PM IST

GROUP-1 KEY: గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష తుది సమాధానాలు విడుదలయ్యాయి. అన్ని సమాధానాలు సరిగానే ఉన్నందున ఎవరి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. వివిధ విభాగాల్లో 503 ఉద్యోగాల భర్తీ కోసం జరిగిన పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. గత నెల 29న ప్రాథమిక సమాధానాలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. గత నెల 31 నుంచి నవంబరు 4 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత ఇవాళ తుది కీ వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది.

మరోవైపు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక పరీక్ష ప్రాథమిక కీని కూడా టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. రేపటి నుంచి ఈనెల 20 వరకు అభ్యంతరాలను ఆన్ లైన్​లో సమర్పించాలని సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.