ETV Bharat / state

GROUP-4: 8,180 ఉద్యోగాలు.. 9.5 లక్షల దరఖాస్తులు.. ఈ టిప్స్‌ పాటిస్తే విజేత మీరే - group 4 exams in telangana

Group-4 Exam Preparation Tips: గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,180 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సులువుగా విజయతీరాలకు చేరడానికి విద్యారంగ నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. మరి ఆ టిప్స్‌ ఏంటో ఓసారి చూసేయండి.

group 4 exam preparation tips
group 4 exam preparation tips
author img

By

Published : Feb 3, 2023, 9:43 PM IST

Group-4 Exam Preparation Tips: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. మొత్తం 8,180 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రమైన పోటీ ఉన్న ఈ పరీక్ష జులై 1న జరగనుండగా.. అభ్యర్థులు అందుకనుగుణంగా ఇప్పటికే ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఇదివరకే పరీక్ష సిలబస్‌ను ప్రకటించడంతో ఆయా అంశాల్లో ప్రణాళికా బద్ధంగా ప్రిపేర్‌ అయితే సులువుగా విజయతీరాలకు చేరొచ్చంటున్నారు పోటీ పరీక్షల కోచింగ్‌ నిపుణులు. గ్రూప్‌-4 రాత పరీక్షలో పేపర్‌ 1తో పోలిస్తే.. పేపర్‌ 2 స్కోరింగ్‌కు ఆస్కారం ఇస్తుందని.. పరీక్షకు ఇంకా దాదాపు ఐదు నెలల సమయం ఉండటంతో ప్రణాళికాబద్ధంగా చదివితే పేపర్‌-1లోనూ అధిక స్కోరు సాధించవచ్చని ప్రముఖ విద్యారంగ నిపుణులు కొడాలి భవానీ శంకర్‌ చెబుతున్నారు. అంశాల వారీగా ఎలా ప్రిపేర్‌ కావాలో ఆయన చేసిన కీలక సూచనలివే..

  • పేపర్‌ 1లో ఉన్న 11 విభాగాల్లో తెలంగాణ సంబంధిత - భౌగోళికం, తెలంగాణ ఉద్యమం, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, పాలనా విధానాలు, ఆర్థిక వ్యవస్థ మొదలైనవాటిపై తొలి దృష్టి పెడితే, 40-50 ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది. అందువల్ల తెలంగాణ అంశాలతో సన్నద్ధత ఆరంభించడం మంచిది.
  • భారత రాజ్యాంగం అనే అంశంపై 10-15 ప్రశ్నలకు అవకాశం ఉంది. తక్కువ సమయంతో ఎక్కువ ఫలితాన్ని అందించే విభాగం ఇదే. చాప్టర్ల వారీగా ప్రాధాన్యం నిర్ణయించుకుని చదవాలి. కరెంట్‌ అఫైర్స్‌ను అనుసంధానించుకుని చదివితే ఎగ్జామినర్‌ దృష్టి పడే అంశాలు అర్థమవుతుంటాయి. పాత ప్రశ్నపత్రాల్లో అడిగిన ప్రశ్నలు కూడా రిపీట్‌ అయ్యే అవకాశం ఉన్నందున వాటి సాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  • భారతదేశ భౌగోళిక అంశాల్లో బేసిక్స్‌ ప్రధానంగా ప్రశ్నలుంటాయి. పాఠశాల పుస్తకాల్లోని అంశాలను అభ్యసించి, ఆపై డిగ్రీ స్థాయివి చదివితే మంచిది.
  • భారత ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే.. 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో పుస్తకాల్లో ఉన్న బేసిక్స్‌ ముఖ్యం. భారతదేశ ఆర్థిక సర్వే, బడ్జెట్లపైన స్థూలంగా అవగాహన పెంచుకోవాలి. లోతైన గణాంకాల అవసరం సాధారణంగా ఉండదు. ప్రణాళిక వ్యవస్థ, నీతి ఆయోగ్‌, సాంఘిక ఆర్థిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం మౌలిక భావనలు తెలుసుకోవాలి. వాటి నిర్మూలనకు భారత ప్రభుత్వ చర్యలపై అవగాహన ఉండాలి. అందుకు తాజా కేంద్ర పథకాలపై పట్టు సాధించాలి. విత్త, ద్రవ్య వ్యవస్థలపై పరిజ్ఞానం అవసరం. వర్తమాన సమాచారంతో అనుసంధానం చేసుకోవాలి.
  • భారత జాతీయోద్యమంపై అత్యధిక శాతం ప్రశ్నలు రావొచ్చు. సంవత్సరాల వారీగా ఉద్యమంలోని వివిధ దశలు- ఫలితాలు, ఉద్యమాన్ని నడిపిన ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు, జాతీయోద్యమం నాటి గవర్నర్‌ జనరల్స్‌, ఆ కాలంలో విడుదలైన బ్రిటిష్‌ చట్టాలు, వాటికి భారతీయ స్పందన, ఉద్యమ కాలంలో తెలంగాణలో జరిగిన సంఘటనలు మొదలైన రూపాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తెలుగు అకాడమీ ‘జాతీయోద్యమ చరిత్ర’ బాగా ఉపయోగపడే పుస్తకం.
  • సిలబస్‌లో పేర్కొన్నదాన్ని బట్టి దైనందిన జీవితంలో సైన్స్‌ అనువర్తనాలపై ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అలాగే భావిస్తే- పాఠశాల స్థాయి పుస్తకాల్లోని భౌతిక జీవ రసాయన శాస్త్ర అనువర్తనాన్ని చదువుకుంటే సరిపోతుంది. అందువల్ల పాఠ్యపుస్తకాల్లోని సైద్ధాంతిక అంశాలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా మౌలిక అంశాలను చదువుకుని అనువర్తనాలపై దృష్టి పెట్టాలి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం సిలబస్‌లో పేర్కొనలేదు గనక ప్రశ్నలు వచ్చే అవకాశం లేదనుకోవడం సరికాదు. ఎందుకంటే కరెంట్‌ అఫైర్స్‌లో భాగంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రశ్నలు అడగవచ్చు. నిత్యజీవితంలో సైన్స్‌లో అంతర్భాగంగా వీటిపైనా ప్రశ్నలు అడిగే వీలుంది. అందుకని రోజువారీ జీవితంతో ముడిపడిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై పట్టు సాధించాలి.
  • పర్యావరణ సమస్యలు- విపత్తు నిర్వహణ అంశాలపై 10కి అటు ఇటుగా ప్రశ్నలు రావొచ్చు. 10+2 స్థాయిలో ఉన్న విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు చదివితే చాలు. కొంతవరకు పాఠశాల స్థాయి పుస్తకాల్లోనూ సమాచారం ఉంది. మౌలిక అంశాలు ప్రధానంగా ప్రశ్నల రూపంలో రావొచ్చు.
  • అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలకు సంబంధించి మన దేశానికి వివిధ దేశాలతో ఉన్న సంబంధాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. ముఖ్యంగా సరిహద్దు దేశాలతో సంబంధాలు అనే కోణంలో ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది.
  • అంతర్జాతీయ సంఘటనలు అనే కోణంలో వివిధ ప్రపంచ వేదికలను ప్రధానంగా అధ్యయనం చేయాలి. కరెంట్‌ అఫైర్స్‌ అనుసంధానించుకుని చదివితే మరింత మంచిది. ‘వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం పాత్ర’ అనే కోణం ప్రశ్నలుగా రావచ్చు. అంతర్జాతీయ వేదికను ఎప్పుడు ప్రారంభించారు, వాటి ప్రస్తుత అధ్యక్షత, సభ్య దేశాల సంఖ్య, లక్ష్యాలు, తాజా సమావేశాలు అనే కోణంలో చదవాలి. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వివిధ సంఘటనలూ ముఖ్యాంశాలే. ఇటీవల జరిగిన ఉక్రెయిన్‌ యుద్ధం లాంటివి.

ఇక పేపర్‌ 2 విషయానికి వస్తే..

  • గ్రూప్‌-4 సిలబస్‌లో అత్యధిక మార్కులు వచ్చేందుకు అనువైనది పేపర్‌ 2. గతంలో ఎస్‌ఎస్‌సీ, బ్యాంకు ఉద్యోగాలకు తయారైనవారికి దాదాపు 90% మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. అదే విధంగా ప్రతిరోజూ రెండు నుంచి మూడు గంటల ప్రాక్టీస్‌ చేస్తే తాజా అభ్యర్థులు కూడా దీటుగా మార్కులు తెచ్చుకోవచ్చు.
  • పేపర్‌ 2 లో ఐదు విభాగాలున్నాయి. మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ విభాగంలో కోడింగ్‌ డీకోడింగ్‌, రక్త సంబంధాలు, పజిల్స్‌, వర్గీకరణ, ఎనాలజీ, ఎసర్షన్‌ రీజన్‌, వెర్బల్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలకు ఉన్న లాజిక్‌, పరిష్కార పద్ధతిని తెలుసుకొని వీలైనన్ని ప్రశ్నలకు సాధన చేస్తే గరిష్ఠ మార్కులు తెచ్చుకోవచ్చు. మొదట సైద్ధాంతిక అంశాలు అర్థం చేసుకొని విస్తృత సాధన చేస్తుండటమే ఈ విభాగంలో రాణించే మెలకువ.
  • అంకగణిత, సంఖ్యా సామర్థ్యాలుపై పట్టు పెంచుకోవాలి. వడ్డీ లెక్కలు, కాలం-పని, కాలం- వేగం, నిష్పత్తులు, వాటాలు లెక్కింపు మొదలైన పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ప్రశ్న బోధపడితే పరిష్కారం సులువే. కాబట్టి ప్రశ్నలను అర్థం చేసుకునే విధానంపై దృష్టి పెట్టాలి. అందుకు వీలైనన్ని ప్రశ్నలను సాధన చేయాలి. దత్తాంశ విశ్లేషణ సంబంధిత ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. సాంఖ్యక శాస్త్ర పాఠ్యాంశాలైన సగటు, మధ్యమం, బహుళకం వ్యాప్తి మొదలైన అంశాలను అధ్యయనం చేయటం వల్ల వాటిపై వచ్చే చిన్న చిన్న ప్రశ్నలు ఎదుర్కోవచ్చు. సంఖ్యా సామర్థ్యాల ప్రశ్నలను ఎదుర్కొనేందుకు BODMAS, అంకెల మధ్య ఉండే సహ సంబంధాలు, అంకెల వరుస క్రమాలు మొదలైన సూత్రాల మీద ఆధారపడిన ప్రశ్నలను సాధన చేయాలి.
  • కాంప్రహెన్షన్‌ విభాగంలో సమాచారాన్ని ఒక పేరాగ్రాఫ్‌లో ఇస్తారు. దాన్ని చదివి వివిధ రకాలైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటమే. ఈ ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఏ పుస్తకాలూ చదవాల్సిన అవసరం లేదు. సంబంధిత ప్రాక్టీస్‌ బిట్స్‌ కలిగిన పేరాగ్రాఫ్‌లను చదివి సాధన చేయటం అలవాటైతే చాలు. పేరాను వేగంగా, ఏకాగ్రతతో చదవడం, అర్థం చేసుకోవటం, సంక్షిప్తీకరించుకోవడం అనే అంశాలపై ఆధారపడి ఈ విభాగంలో మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ సూక్ష్మాన్ని గుర్తించి పేరాలను వేగంగా చదువుతూ అర్థం చేసుకుంటే కాంప్రహెన్షన్‌ను సులభంగా ఎదుర్కోవచ్చు.
  • వాక్యాల పునర్నిర్మాణం చేయాల్సిన విభాగంలో ప్రత్యేకంగా సన్నద్ధం అవ్వనక్కర్లేదు. వరస మార్చిన వివిధ వాక్యాలను అర్థవంతమైన రూపంలో తిరిగి అమర్చాలి. ఇలాంటి ప్రశ్నలను సాధన చేయడం ద్వారా మార్కులు రాబట్టుకోవచ్చు.
  • కరెంట్‌ అఫైర్స్‌: ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయని భావించనక్కర్లేదు. పరీక్ష తేదీకి ఆరు నెలలు వెనుక నుంచి ప్రశ్నలు అడగొచ్చు. 9 నెలల కాలావధిలో చదివితే మేలు. ఫ్యాక్ట్స్‌పై దృష్టి పెడుతూనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో మాదిరిగా ప్రశ్నలు వస్తే అని ఆలోచించి చదవడం వల్ల అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు అవుతుంది.
  • గ్రూప్‌-4లో నెగిటివ్‌ మార్కులు లేనందున అన్ని ప్రశ్నలకూ జవాబులు ఇచ్చే వ్యూహం అనుసరించండి. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మాదిరిగా జతపరిచే ప్రశ్నలు, ఎక్కువ సమయం పట్టేవి వస్తాయని బెంబేలు పడనక్కర్లేదు. గ్రూప్‌-4 ఉద్యోగాలు అనేవి ఉద్యోగ వ్యవస్థలో అట్టడుగు ఉద్యోగాలు అయినందున గ్రూప్‌-1 స్థాయి పరీక్షను ఎదుర్కోవాలని భావించటం అహేతుకం. క్లిష్టత గురించి మనసుకు భయాన్ని నేర్పితే చదవడం మీదున్న ఆసక్తి కూడా పోతుంది. అందువల్ల సమగ్ర ప్రిపరేషన్‌ అవసరమే కానీ అనవసరమైన అపోహలతో సిద్ధమవటం మంచిది కాదని గుర్తుంచుకోండి. ఆల్‌ ది బెస్ట్‌..!

ఇవీ చూడండి..

గ్రూప్- 4 పరీక్ష తేదీ ప్రకటించిన TSPSC.. ఎప్పుడంటే?

గ్రూప్‌-4కు ట్రై చేస్తున్నారా.. ఇలా చదివితే జాబ్ పక్కా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.