ETV Bharat / state

గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల - తెలంగాణ తాజా వార్తలు

telangana Public Service Commission
telangana Public Service Commission
author img

By

Published : Oct 29, 2022, 7:37 PM IST

Updated : Oct 29, 2022, 8:32 PM IST

19:26 October 29

గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల

Group-1 Prelims Key released: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి డిజిటల్ కాపీలను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను అందుబాటులో ఉంచారు.

టీఎస్​పీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చి డిజిటల్ పత్రాలు డౌన్​లోడ్ చేసుకోవచ్చునని కమిషన్‌ తెలిపింది. అభ్యర్థుల ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు నవంబర్ 29 వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని.. గడువు అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు ఇచ్చేది లేదని టీఎస్​పీఎస్సీ స్పష్టం చేసింది.

ప్రిలిమ్స్ పరీక్షలో వివిధ సీరిస్‌లలో ప్రశ్నాపత్రాలను కమిషన్ ఉపయోగించింది. ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సీరిస్‌లో ప్రశ్నాపత్రాలను రూపొందించారు. వాటి అన్నింటికి మాస్టర్‌గా ఉన్న ప్రశ్నాపత్రాన్ని, దాని ప్రాథమిక కీని కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రాథమిక కీపై రేపట్నుంచి నవంబర్ నాలుగో తేదీ వరకు కమిషన్ వెబ్ సైట్ ద్వారా అభ్యంతరాలు స్వీకరిస్తారు.

కేవలం వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుందని.. ఈ-మెయిల్, వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను కూడా లింక్‌లో పీడీఎఫ్ ద్వారా జతపర్చాలని టీఎస్​పీఎస్సీ తెలిపింది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించే ప్రసక్తి లేదని కూడా పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 29, 2022, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.