ఏపీలో.. గ్రూప్-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూయేషన్ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఇంగ్లీష్ మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లో వాల్యూయేషన్ చేశారని, ఈ కారణంగా ఆంగ్ల భాషలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో వాల్యూయేషన్ ఎలా చేయిస్తుందని వాదించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని కోర్టుకు వివరించారు. ఇంటర్వూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
నిబంధనల ప్రకారమే గ్రూప్-1 ప్రధాన పరీక్షలను నిర్వహించామని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూయేషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. త్వరలోనే గ్రూప్-1 పరీక్షలకు ఇంటర్వూలు జరగనుండగా.. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి: Challan: బైక్‌పై ఫోన్లో మాట్లాడుతూ యువతి ఫోజులు... అవాక్కైన పోలీసులు