ETV Bharat / state

ప్రైవేట్ పాఠశాలల వ్యాన్​ డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ - techi ride

కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల వ్యాన్​ డ్రైవర్ల జీవన దుర్భరంగా మారిందని సేవాధాన్​ సంస్థ అధికార ప్రతినిధి కాసారం స్రవంతి అన్నారు. హైదరాబాద్​ అడిక్​మెట్​లో వ్యాన్​ డ్రైవర్లకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

groceries distribution to van drivers at adikmet in hyderabad
స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వ్యాన్​ డ్రైవర్లకు సరకుల పంపిణీ
author img

By

Published : Jun 27, 2020, 5:35 PM IST

స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం మరువలేమని వ్యాన్ డ్రైవర్లు పేర్కొన్నారు. లాక్​డౌన్ ఉపసంహరించినా కరోనా విజృంభించిన నేపథ్యంలో విద్యాసంస్థల వ్యాన్ డ్రైవర్ల జీవనం దుర్భరంగా మారింది. ఈ పరిస్థితుల్లో టెక్కీ రైడ్, సేవాధాన్ సంస్థలు సంయుక్తంగా వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాయి. హైదరాబాద్ అడిక్​మెట్​లో సేవాధాన్ సంస్థ ప్రతినిధి కాసారం స్రవంతి నిత్యావసర సరకులను పాఠశాల వ్యాన్ డ్రైవర్లకు అందజేశారు.

ప్రస్తుతం హైదరాబాద్​లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వ్యాన్ డ్రైవర్ల జీవనం దుర్భరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. వారి ఇబ్బందులను గమనించి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో 15 రోజులకు సరిపడా నిత్యావసర సరకులను అందజేసినట్లు వివరించారు.

ఇవీ చూడండి: అమీర్‌పేట్ త‌హ‌సీల్దార్ చంద్రక‌ళ‌కు క‌రోనా నిర్ధరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.