హైదరాబాద్ రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని రంగ్రేజ్ బజార్, బోయిగూడల్లోని బస్తీ వాసులకు నిత్యావసర సామగ్రిని కార్పొరేటర్ అత్తిలి అరుణ అందజేశారు. పేదప్రజలు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిత్యావసరాల పంపిణీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్స్ వినియోగించాలని.. భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!