ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు నిత్యావసరాలు పంపిణీ - తెలంగాణ వార్తలు

కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు సర్వీమిత్ర మండలి, నవ్యశ్రీ సామాజిక సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖైరతాబాద్​లో 150 మందికి అందజేశారు. ఆకలితో అల్లాడుతున్న వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

groceries distribution to sanitary workers, corona help
నిత్యావసర సరుకులు పంపిణీ, పారిశుద్ద్య కార్మికులకు నిత్యావసరాలు
author img

By

Published : Jun 13, 2021, 12:42 PM IST

కరోనా కాలంలో అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. సర్వీమిత్ర మండలి, నవ్యశ్రీ సామాజిక సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఖైరతాబాద్ చింతలబస్తీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 150 మందికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. సరిపడా జీతాలు, రక్షణ లేకున్నా ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారని సేవాసమితి అధ్యక్షుడు నగేష్ తెలిపారు. ఆకలితో అల్లాడుతున్న వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయిన వారి ఆకలి తీర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గతేడాది లాక్​డౌన్​​లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: 5 కి.మీ. భుజాలపై మోసి.. ఆస్పత్రిలో చేర్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.