ETV Bharat / state

సామాజిక సేవలోనే సంపూర్ణ ఆనందం: ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు - తెలంగాణ తాజా వార్తలు

సేవా భారత్, వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వైఎంసీఏలో 300 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భాను ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

groceries-distribution-for-poor-people-in-secunderabad-by-seva-bharat-and-ymca-in-hyderabad
సామాజిక సేవలోనే సంపూర్ణ ఆనందం: ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు
author img

By

Published : Jan 17, 2021, 9:02 AM IST

సామాజిక సేవ చేయడంలోనే మనిషికి సంపూర్ణ ఆనందం లభిస్తుందని తెరాస ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు అన్నారు. సేవా భారత్, వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వైఎంసీఏలో 300 మంది పేదలకు, జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... లాక్​డౌన్ సమయంలో ఎంతో మంది మానవతావాదులు పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారని కొనియాడారు. ఇలాంటి వాటిలో సేవా భారత్, గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏలు ముందున్నాయన్నారు.

లాక్​డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా లక్ష కుటుంబాలకు నెలకు సరిపడే బియ్యంతో పాటు 12 రకాల వస్తువులను అందించామని సేవా భారత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ ప్రభుదాస్ అన్నారు. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా తాము సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. పాతబస్తీలో 10 వేల ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించామని చెప్పారు. 40 ఏళ్ల నుంచి తమ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

సేవా భారత్​తో కలిసి తాము నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జయకర్ డేనియల్. పేదలకు నిత్యావసర వస్తువులు, దుస్తులు అందించామని చెప్పారు. త్వరలోనే అనాథ బాలుర కోసం వసతి గృహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఉచిత ఐఏఎస్ , ఐపీఎస్ స్టడీ సర్కిల్​ను ప్రారంభించబోతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోపాలపురం ఇన్​స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్, చంద్రశేఖర్, వైఎంసీఏ ప్రతినిధులు కిరణ్ కుమార్, లెనార్డ్, సంపత్, జేమ్స్ కెన్నెత్, ప్రతీక్, అజేత తదితరులు పాల్గొన్నారు .

ఇదీ చదవండి: ట్విట్టర్​ ట్రెండింగ్​గా 'లార్జెస్ట్​ వ్యాక్సిన్ డ్రైవ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.