హైదారాబాద్ గోశామహల్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో మైనారిటీ కుటుంబాలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్... వారానికి సరిపడా నిత్యావసర సరుకులను అందించింది. రంజాన్ మాసంలో నిరుపేద మైనారిటీలను గుర్తించి... వారికి అండగా ఉంటామని ట్రస్ట్ ఛైర్మన్ నందు కిశోర్ బిలాల్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు 32వేల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈనెల 29వరకు కొనసాగిస్తామని వెల్లడించారు.
ఇవీ చూడండి: దూసుకొస్తున్న 'ఆంఫాన్' తుఫాన్- హోంశాఖ హెచ్చరిక