లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్రావు కోరారు. హైదరాబాద్ అంబర్పేటలో పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని రాంచందర్రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు.